Kayal Anandhi: ఈ సినిమా నా సినీ ఇమేజ్‌ను మార్చేస్తుంది
ABN , Publish Date - Feb 09 , 2024 | 08:59 PM
తాను ప్రధాన పాత్రను పోషించిన ‘మంగై’ చిత్రం తనకు ఎంతో స్పెషల్ అని, ఈ చిత్రం తన సినీ ఇమేజ్‌ను మారుస్తుందని హీరోయిన్ ‘కయల్’ ఆనంది గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఏఎస్ఎం పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఆర్ జాఫర్ సాధిక్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కుబేరన్ కామాక్షి దర్శకత్వం వహించారు. ఆనంది, దుషి, రామ్స్, ఆదిత్యా కదిర్ తదితరులు నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు.
తాను ప్రధాన పాత్రను పోషించిన ‘మంగై’ (Mangai) చిత్రం తనకు ఎంతో స్పెషల్ అని, ఈ చిత్రం తన సినీ ఇమేజ్‌ను మారుస్తుందని హీరోయిన్ ‘కయల్’ ఆనంది (Kayal Anandhi) గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఏఎస్ఎం పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత ఏఆర్ జాఫర్ సాధిక్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కుబేరన్ కామాక్షి దర్శకత్వం వహించారు. ఆనంది, దుషి, రామ్స్, ఆదిత్యా కదిర్ తదితరులు నటించారు. ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నై నగరంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కయల్ ఆనంది మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఒక ట్రావెల్ కథ. అందుకే అనేక షెడ్యూల్స్‌లో చిత్రీకరణ చేస్తే సమస్యలు వస్తాయని ఊహించి ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేశాం. కథ ఏంటని దర్శకుడిని అడగ్గా.. ఆయన స్ర్కిప్టు చేతిలో పెట్టారు. దాన్ని చదివిన తర్వాతే ఈ చిత్రాన్ని వదులుకోకూడదన్న నిర్ణయానికి వచ్చాను. ఒక మహిళ గురించి పురుషుడు మాట్లాడే కోణంలో సాగుతుంది. తన ప్రయాణంలో మహిళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయాలను దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నా సినీ కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు మరో స్థాయికి చేరుకుంటారు’’ అని ఆనంది పేర్కొన్నారు. (Mangai Movie Audio Launch)
దర్శకుడు కుబేరన్ కామాక్షి (Kuberan Kamachi) మాట్లాడుతూ.. ‘‘హీరోయిన్ ఆనంది లేకుంటే ఈ చిత్రం ఈ స్థాయిలో రూపుదిద్దుకునేది కాదు. దుష్యంత్ మంచి నటుడు.. మంచి డ్రైవర్ కూడా. కవితా భారతి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. ఆయన దర్శకుడు కావడంతో అనేక ఐడియాలు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా నిర్మాత ఏఆర్ జాఫర్ సాధిక్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
====================
*మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు అందిన ఆహ్వానం..
**************************
*Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..
*************************
*Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం
**************************