Karthi: జనవరిలో కార్తీ మరో సినిమా..
ABN , Publish Date - Oct 17 , 2024 | 09:56 PM
హీరో కార్తీ నటిస్తున్న కొత్త చిత్రాన్ని వచ్చే యేడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల కార్తీ నటించిన ‘మెయ్యళగన్’ విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్, రిలీజ్ వివరాల్లోకి వెళితే..
హీరో కార్తీ (Hero Karthi) నటిస్తున్న కొత్త చిత్రం ‘వా వాత్తియార్’ (Vaa Vaathiyaare)ను వచ్చే యేడాది జనవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ‘మెయ్యళగన్’ విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ కొత్త చిత్రం తెరకెక్కుతుంది. సీనియర్ నటుడు రాజ్ కిరణ్ తాతగా, సత్యరాజ్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటించగా, ఆనంద్ రాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..
స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఈ చిత్రం విడుదలపై స్పందిస్తూ.. జనవరి నెలలో ‘వా వాత్తియార్’ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే స్ర్కిప్టుతో ఈ సినిమాను రూపొందించాము. ముఖ్యంగా కార్తీ నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాను అయితే ఊహిస్తారో.. అలాంటి సినిమానే ఇది. నలన్ కుమారస్వామి డైరెక్షన్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
కార్తీ విషయానికి వస్తే.. ఇటీవల అరవింద్ స్వామితో కలిసి ఆయన చేసిన ‘మెయ్యళగన్’ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంది. ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుని డీసెంట్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సినిమా ‘సత్యం సుందరం’ పేరుతో విడుదలై.. మంచి స్పందనను రాబట్టుకుంది.