Karthi: నేను అన్నయ్య సూర్య నుంచి నేర్చుకున్నది అదే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:34 PM

అంకితభావంతో పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తన అన్న హీరో సూర్య నేర్పించారని హీరో కార్తీ అన్నారు. హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీ సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ చేశారు. ‘జీరో నుంచి ప్రారంభించినా కష్టపడుతూ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నేర్పిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సమాజంలో అపారమైన ప్రేమను పంచుతున్న అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు.

Karthi and Suriya

అంకితభావంతో పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని తన అన్న హీరో సూర్య (Suriya) నేర్పించారని హీరో కార్తీ (Karthi) అన్నారు. హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీ సోషల్‌ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ చేశారు. ‘జీరో నుంచి ప్రారంభించినా కష్టపడుతూ, అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని నేర్పిన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. సమాజంలో అపారమైన ప్రేమను పంచుతున్న అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. (Karthi Birthday Wishes to Suriya)

Also Read- 30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..

ఇక హీరో సూర్య విషయానికి వస్తే, ఆయన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆయన నటించిన ‘కంగువా’ (Kanguva) చిత్రం అక్టోబరు 10న విడుదలకానుంది. అలాగే, కార్తీక్‌ సబ్బరాజ్‌ దర్శకత్వంలో తన 44వ (Suriya44) చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు తమ్ముడు కార్తీ హీరోగా సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ‘మెయ్యళగన్‌’ (Meiyazhagan) చిత్రాన్ని నిర్మించగా, ఈ సినిమా సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేయనున్నారు.


Karthi-and-Suriya.jpg

అన్నదమ్ములు అంటే వీరు అనేలా సూర్య, కార్తీ (Suriya and Karthi) ఎప్పటికప్పుడు ఒకరంటే ఒకరు ప్రేమను ప్రదర్శిస్తుంటారనే విషయం తెలియంది కాదు. అన్న అంటే కార్తీకి అపారమైన ప్రేమ. ఆ విషయం ఎన్నో సందర్భాలలో తెలియజేశారు కూడా. సూర్య ఈ రోజు స్టార్ హీరో స్టేటస్‌లో ఉన్నారంటే ఆయన ఎంత కష్టపడి ఆ స్థానాన్ని సంపాదించుకున్నారో.. ఈ ఒక్క ట్వీట్‌తో తెలిసిపోతుంది. అలాగే కార్తీ కూడా.. తన అన్న పేరు చెప్పుకోకుండా.. తనకంటూ ఓ స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మరి విశేషమేమిటంటే.. ఈ ఇద్దరు అన్నదమ్ములకు టాలీవుడ్‌లో సైతం అభిమానులుండటం. వారి సినిమాలు టాలీవుడ్‌లో కూడా మంచి విజయం సాధిస్తుండటం.

Read Latest Cinema News

Updated Date - Jul 25 , 2024 | 06:34 PM