Kanguva: రిలీజ్‌కి ముందు ఇగో క్లాష్.. భారీ నష్టం

ABN , Publish Date - Nov 13 , 2024 | 04:16 PM

కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్‌కి విచిత్ర పరిస్థితి ఎదురైంది. రెండు నిర్మాణ సంస్థల మధ్య ఉన్న చిన్న ఇగో క్లాష్ ద్వారా సినిమా నష్టపోతుంది. ఇంతకీ ఏమైందంటే..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘కంగువ’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మేకర్స్ కి విచిత్ర పరిస్థితి ఎదురైంది. రెండు నిర్మాణ సంస్థల మధ్య ఉన్న చిన్న ఇగో క్లాష్ ద్వారా సినిమా నష్టపోతుంది. ఇంతకీ ఏమైందంటే..


'కంగవ' సినిమా రిలీజ్ కి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ అన్ని ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. కానీ.. తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ మాత్రం అంతంతా మాత్రంగానే ఉన్నాయి. నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎషియన్ సంస్థకు వచ్చిన ఇగో క్లాష్ వల్ల చాలా థియేటర్స్ లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ప్రధానంగా పీవీఆర్, ఏఎంబి, ఏఏఏ వంటి పెద్ద మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ చాలా ఆలస్యం కానున్నాయి. యువీ క్రియేషన్స్ భాగస్వామ్యంతో జ్ఞానవేల్ రాజా నిర్మించిన కంగువ విడుదలలో విషయంలో ఎందుకో ఎదోక జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు నైజాంలో ఇష్యూ ఎప్పుడు సెట్ అయ్యి.. బుకింగ్స్ ఓపెన్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

WhatsApp Image 2024-11-13 at 15.29.47 (1).jpeg


మరోవైపు తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదు. ఒక థియేటర్‌లో బెనిఫిట్‌ షోలో జరిగిన యాక్సిడెంట్ తర్వాత, తమిళనాడు ప్రభుత్వం అదనపు షోలకు అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. పెద్ద హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి వారి సినిమాలకు కూడా అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇంతకు ముందు వచ్చిన విజయ్ ‘ది గోట్’ సినిమాకు మాత్రం ఉదయం 9 గంటల ఆటలకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు సూర్య సినిమాకు ఉదయం 9 గంటల ఆటతో పాటు రాత్రి 2 గంటల లోపు మరో ఆటను ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వడం విశేషం. అయితే, అనుమతి ఇచ్చినప్పటికీ అది ఒక్క రోజుకే పరిమితం చేయడం గమనార్హం. అలాగే ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.


ఇదిలా ఉంటే, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ‘కంగువా’ తొలి ఆట తెల్లవారు జామున 4 గంటలకే ప్రదర్శించనున్నారు. తమిళనాడులో మాత్రం ఇలాంటి అనుమతి లభించలేదు. ఈ ఒక్కరోజు అనుమతి ఇవ్వడానికి కూడా కారణం విజయ్ పెట్టిన పార్టీనే అని తెలుస్తోంది. ప్రభుత్వాలు సరిగా పనిచేయడం లేదని, అందుకే తను పార్టీ పెట్టాల్సి వస్తుందనేలా విజయ్ చేసిన కామెంట్స్‌తో.. ఇకపై సినిమాల విషయంలో, అందులోనూ స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించే ప్రయత్నం చేస్తోంది. సూర్య ‘కంగువా’ సినిమాతో ఆ సడలింపులు మొదలయ్యాయి.

Also Read-Prabhas: పెళ్లిపై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2024 | 04:19 PM