Kamal237: చికాగోలో ‘కమల్‌ 237’ ప్రీ ప్రొడక్షన్‌ పనులు.. ఫొటో వైరల్

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:36 AM

ప్రస్తుతం యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ తన 236వ చిత్రం ‘థగ్ లైఫ్’ను మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తన 237వ చిత్రం కూడా ఇటీవల ప్రకటించారు. ఆ సినిమా ప్రస్తుతం చికాగోలో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Anbarivu with Kamal Haasan

స్టంట్‌ మాస్టర్స్‌ ద్వయం అన్బరివులు అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ 237 (Kamal237)వ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ నిర్మాణ పనులు చికాగోలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న కమల్‌ హాసన్‌ను దర్శక ద్వయం కలుసుకుని, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది.

‘ఇండియన్‌-2’ చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌లైఫ్‌’ అనే చిత్రంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ(ఏఐ) పనులు రెండు నెలలుగా అమెరికాలో జరుగుతున్నాయి. వాటిని పూర్తి చేసుకుని ఆయన త్వరలో చెన్నై నగరానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత తన 237వ చిత్ర పనులపై ఆయన దృష్టిసారించనున్నారు.


Kamal237.jpg

‘కమల్‌ 237’ సినిమా వివరాల్లోకి వెళితే.. ఇది పూర్తి స్థాయి యాక్షన్‌ భరితంగా తెరకెక్కనుంది. అన్బరివులు కూడా కొత్త ప్రాజెక్టులు ఏవీ అంగీకరించకుండా కేవలం కమల్‌ సినిమాపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని చికాగోలో ఉన్న కమల్‌ హాసన్‌ను కలిసి ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోతో దిగిన ఫొటోను వారు షేర్‌ చేయగా.. ఆ ఫొటో వైరల్ అవుతోంది. ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ హాసన్ వరుస సినిమాలతో స్పీడు మీదున్న విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి ఆయన నుండి సినిమా ప్రకటనలు వస్తున్నాయి. అలాగే నిర్మాతగానూ ఆయన బిజీగా ఉన్నారు. ఆయన నిర్మించి, రీసెంట్‌గా వచ్చిన ‘అమరన్’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.


Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 08:36 AM