Jyotika: 'కంగువా' రివ్యూలపై జ్యోతిక ఫైర్.. వాటికంటే దారుణమా
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:51 PM
ఇటీవల రిలీజైన 'కంగువా' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చాలామంది విశ్లేషకులు సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో సూర్య భార్య హీరోయిన్ జ్యోతిక ఫుల్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె రివ్యూలర్లు టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్రెస్టీజియస్ మూవీ 'కంగువా’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందించారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చాలామంది విశ్లేషకులు సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో సూర్య భార్య హీరోయిన్ జ్యోతిక ఫుల్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె రివ్యూలర్లు టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక 'కంగువా' సినిమా రివ్యూలపై మండిపడ్డారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పోస్ట్ చేస్తూ.. " ఇది నేను సూర్య భార్యగా రాయడం లేదు. ఒక సినీ ప్రేమికురాలిగా రాస్తున్న. కంగువ ఓ అద్భుతమైన సినిమా. సూర్య మీరు ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాను మీ డ్రీమ్. దానిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ చెప్తున్నట్టుగానే.. సినిమాలో మొదటి అరగంట కాస్త వర్క్ అవుట్ కాలేదు. సౌండ్‌లో కూడా కాస్త సమస్యలు ఉన్నాయి. ఇలాంటి లోపాలు సినిమాల్లో ఓ భాగం. భారతీయ చిత్రాల్లో ఇది చాలా కామన్. ముఖ్యంగా సరికొత్తగా సినిమాలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. వాటిని ప్రయోగాల్లో భాగంగానే చూడాలి. అయితే మొదటి అరగంట సినిమాని పట్టుకుని.. తర్వాతి రెండున్నర గంటల సినిమాని నెగిటివ్ చేయడం సరికాదు. నిజం చెప్పాలంటే కంగువ అనేది గొప్ప సినిమేటిక్ అనుభవం. కెమెరా వర్క్, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని నేను తమిళ సినిమాల్లో ముందెప్పుడు చూడలేదు. అయితే కొందరు మీడియాకి చెందిన వ్యక్తులు, మరికొందరు కలిసి.. కావాలనే సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు" అంటూ కొనసాగించారు.
వాటికంటే దారుణమా
నెగిటివ్ రివ్యూలు చూసి నేను షాక్ అయ్యాను. మీడియాకి చెందిన వారు.. మరికొందరు కంగువకు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. స్త్రీలను ఇబ్బంది పెట్టడం, పాత కథే చెప్పడం, డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో వచ్చిన అనేక పాన్ ఇండియా సినిమాలకి ఏ మేధావి నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదు. అలాంటి చెత్త లేని ఈ సినిమాకి మాత్రం
ఇలాంటి రివ్యూలు కరెక్ట్ కాదన్నారు. సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లు.. దాని గురించి పాజిటివ్‌గా రాయడం మరచిపోయారు. సినిమా రెండో భాగంలో స్త్రీల యాక్షన్ సీక్వెన్స్, పిల్లాడిపై చూపించిన ప్రేమ, కంగువకు జరిగిన ద్రోహం ఇలాంటి పాజిటివ్ విషయాలు అన్ని.. రివ్యూల్లో రాయడం మరిచిపోయారని అనుకుంటున్నానంటూ ఆమె అన్నారు.
మీ కెరీర్లో ఏం చేశారని
అలాంటి రివ్యూలను చదవాలా? వినాలా? నమ్మాలా? నాకు తెలియట్లేదు. కంగువను 3D సినిమాగా రూపొందించడానికి చిత్రబృందం పడిన కష్టానికి వారికి ప్రశంసలు రావాలి. అవి రాకపోగా.. మొదటి షో పూర్తవకముందే.. కొందరు కావాలనే సినిమాపై నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా విడుదలైన మొదటి రోజే ఇంత నెగిటివ్ టాక్ని ప్రచారం చేయడం చాలా విచారించాల్సిన విషయం. ఈ రివ్యూలు రాసిన వారు సినిమాని ఉద్దరించడానికి వారి కెరీర్లో ఏమి చేసి ఉండరు. అందుకే వాళ్లకు పాజిటివ్‌గా మాట్లాడటానికి ఒక్క పాయింట్ కనిపించలేదంటూ ముగించారు.