Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:34 PM
ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదని హీరో ప్రశాంత్ స్పష్టం చేశారు. అయితే నటుడిగా ప్రజలకు ఏం చేయగలనో అది చేస్తానని వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా తిరునెల్వేలి, తూత్తుక్కుడి జిల్లాల్లో ఆయన పర్యటిస్తూ అభిమానులను కలుసుకుంటున్నారు. అదేసమయంలో ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్ చేసేటపుడు విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరుతూ, అవగాహన కల్పించేలా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పట్లో తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశ్యం ఏమాత్రం లేదని హీరో ప్రశాంత్ (Prashanth) స్పష్టం చేశారు. అయితే నటుడిగా ప్రజలకు ఏం చేయగలనో అది చేస్తానని వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా తిరునెల్వేలి, తూత్తుక్కుడి జిల్లాల్లో ఆయన పర్యటిస్తూ అభిమానులను కలుసుకుంటున్నారు. అదేసమయంలో ద్విచక్రవాహనదారులు డ్రైవింగ్ చేసేటపుడు విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన కోరుతూ, అవగాహన కల్పించేలా ప్రచారం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘హెల్మెట్ (Helmet)ను శిరస్త్రాణం అని చెబుతారు. ఈ హెల్మెట్ మన ప్రాణాలను రక్షించే కవచం మాత్రమే కాకుండా, కుటుంబానికి రక్షణ కవచంగా ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వారిలో అనేక మంది హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రాణనష్టం జరుగుతుంది. అందుకే శిరస్త్రాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా నా వంతు ప్రచారం చేస్తున్నాను.
ఇపుడు విజయ్ ‘గోట్’ మూవీలో నటిస్తున్నాను. పెద్ద హీరోలతో కలిసి నటించడం కొత్తకాదు. ‘కల్లూరి వాసల్’ సినిమా నుంచి ఇది కొనసాగుతుంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం (Vijay Political Entry), పార్టీని ప్రారంభించడం మంచి విషయం. కానీ, నేను మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘అంధగన్’ (Andhagan) చిత్రం త్వరలోనే విడుదలకానుంది. ‘జీన్స్’ (Jeans) మూవీ సీక్వెల్ గురించి ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. దీనికి నా వద్ద సమాధానం లేదు. దర్శకుడు శంకర్ (Director Shankar) బదులివ్వాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*SV18: గీతా ఆర్ట్స్‌లో సినిమా.. శ్రీ విష్ణు రియాక్షన్ చూశారా..
***********************************
*Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..
*************************
*Sree Vishnu: ‘రాజ రాజ చోర’ కాంబినేషన్ రిపీట్.. ఈసారి అచ్చతెలుగు సినిమా!
**************************