Yuvanshankar Raja: దేశంలో తొలిసారి.. 360 డిగ్రీల వేదికపై సంగీత విభావరి

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:43 AM

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీత విభావరి (శనివారం) నందనంలోని వైఎంసీఏ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ షోకు ప్ర‌జ‌ల నుంచి అద్భుత స్పంద‌న రాగా ఇసుకేస్తే రాల‌నంత‌గా జ‌నంతో నిండిపోయింది.

Yuvanshankar Raja

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvanshankar Raja) సంగీత విభావరి 27 (శనివారం) నందనంలోని వైఎంసీఏ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. నాయిస్‌ అండ్‌ గ్రెయిన్స్ (Noise And Grains), బూమర్‌ ఫ్యాషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ లైవ్‌ కాన్సర్ట్‌ కోసం దేశంలోనే తొలిసారి 360 డిగ్రీల వేదిక ఏర్పాటు చేయడం విశేషం.

GTQQNqvXwAAQJLD.jpeg

ఈ షోకు ప్ర‌జ‌ల నుంచి అద్భుత స్పంద‌న రాగా వారం రెజుల ముందే టికెట్లు అమ్ముడు పోగా వేదిక అంతా ఇసుకేస్తే రాల‌నంత‌గా జ‌నంతో నిండిపోయింది.

GTQHi4AXkAA8t5g.jpeg

ఈ సందర్భంగా నిర్వాహ‌కులతో కలిసి యువన్‌ శంకర్‌ రాజా (Yuvanshankar Raja) మాట్లాడుతూ.. ‘గతంలో జరిగిన ఒక షోలో తనకు, అభిమానులకు మధ్య బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇది అభిమానులు దూరంగా ఉన్నామనే ఫీలింగ్‌ కలిగింది.

GTQQNqvXwAAQJLD.jpeg

అభిమానులకు చాలా దగ్గరగా ఉంటూ సంగీత విభావరిని నిర్వహించాలన్న భావన నాలో ఏర్పడింది. నా అభీష్టానికి అనుగుణంగా ఈ రెండు సంస్థలు కలిసి 360 డిగ్రీల వేదిక ఏర్పాటు చేసి, అక్కడ ఈ మ్యూజిక్‌ లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించినట్లు తెలిపారు.


GTfjsWdagAAkD87.jpeg

‘యు1 లాంగ్‌ డ్రైవ్‌ లైవ్‌ ఇన్‌ కాన్సర్ట్‌’ (U1 Long Drive)పేరుతో నిర్వహించిన‌ ఈ సంగీత విభావరిలో యువన్ శంకర్ రాజాతో (Yuvanshankar Raja) పాటు ఆండ్రియా, హరిచరణ్‌, ప్రేమ్‌ జీ అమరన్‌, రాహుల్‌ నంబియార్‌, హరిప్రియ, దివాకర్‌ రిషా, ఆదిత్య, శ్రీ నిషా, ఎంసీ సన వంటి గాయనీగాయకులు పాటలు పాడారు. నిర్వాహకుడు లింగుస్వామి మాట్లాడుతూ.. త్వరలో కోయంబత్తూరు, సింగపూర్‌లో ఇదే తరహా సంగీత విభావరిలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, వీటికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తామని తెలిపారు.

GTQNDmsWQAAr6t_.jpeg

Updated Date - Jul 28 , 2024 | 11:43 AM