Vijay: ఎట్టకేలకి రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్

ABN , Publish Date - Feb 02 , 2024 | 02:43 PM

తమిళ అగ్ర నటుడు విజయ్ తమిళగ వెట్రి కజం అనే రాజకీయ పార్టీ ని ప్రారంభించి, 2026లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుండి పనిచేస్తామన్నారు. రాజకీయాలు కేవలం హాబీ కోసం కాకుండా, అందులో పూర్తిగా పని చెయ్యాలనుకుంటున్నట్టు చెప్పారు విజయ్

Vijay: ఎట్టకేలకి రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్
Tamil Superstar Vijay announced his entry into politis

ఎప్పటినుండో తమిళ అగ్రనటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలు వస్తున్నా, ఎట్టకేలకు అధికారికంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు అతను ఈరోజు ప్రకటించారు. తన పార్టీకి 'తమిళగ వెట్రి కజం' (TVK) అని పేరు పెట్టి, తమిళంలో రాసిన ఒక పెద్ద నోటును తన సామజిక మాధ్యమంలో షేర్ చేశారు. దీనితో రాబోయే రోజుల్లో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని మార్పులు సంభవించనున్నాయని విశ్లేషలు అంటున్నారు.

vijaythalapathyone.jpg

విజయ్ తన రాజకీయ పార్టీని ప్రారంభిస్తూ తమిళనాడు రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. “రాజకీయాలోకి రావటానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను, ఇది కేవలం హాబీ కోసం మాత్రం రావటం లేదు, నాకు రాజకీయాల్లో పూర్తిగా పాలు పంచుకోవాలని వుంది, అందుకో వచ్చాను, ఇది నాకు కెరీర్ కంటే ఎక్కువ," అని చెప్పుకొచ్చారు.

తమిళ అగ్ర నటుల్లో విజయ్ కి లక్షల్లో అభిమానులు వున్నారు. కులమతాలకు అతీతంగా, నిస్వార్థమైన, సమర్ధవంతమైన పాలన తీసుకు వచ్చే దిశగా తన పార్టీ పని చేస్తుందని చెప్పారు. అలాగే అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి దోహదం చేస్తానని చెప్పారు.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ 2026 అసీంబ్లీ ఎన్నికలకి ఇప్పటినుండి సమాయత్తం అయి గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు విజయ్.

Updated Date - Feb 02 , 2024 | 02:43 PM