Sivakarthikeyan: మ‌రోసారి శివకార్తికేయన్.. ‘డాన్‌’ కాంబినేషన్‌?

ABN , Publish Date - Jul 07 , 2024 | 07:50 AM

హీరో శివకార్తికేయన్, దర్శకుడు శిబి చక్రవర్తి మరోమారు కలిసి పని చేయనున్నారు. 2022లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌’ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది.

don

హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan), దర్శకుడు శిబి చక్రవర్తి (Cibi Chakaravarthi) మరోమారు కలిసి పని చేయనున్నారు. 2022లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్‌’ (Don) చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ సాధించింది. కలెక్షన్లపరంగా నిర్మాతకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇందులో ఎస్‌జే సూర్య (S. J. Suryah) ఓ ముఖ్యపాత్ర పోషించారు. ఇపుడు ఈ ‘డాన్‌’ (Don)కాంబో మరోమారు రిపీట్‌ కానుందని కోలీవుడ్‌లో వర్గాల సమాచారం.

GL8p2HYbMAQk78D.jpeg

శివకార్తికేయన్ 24వ సినిమాగా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాకు ‘బాస్‌’ (Boss) అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు, రష్మిక మందన్నా (Rashmika Mandanna)ను హీరోయిన్‌గా ఎంపిక చేయనున్నట్టు సమాచారం. అయితే, ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రం త‌ర్వాత ప్ర‌స్తుతం విజ‌య్‌తో గోట్ సినిమా చేస్తున్న‌ వెంక‌ట్ ప్ర‌భు (Venkat Prabhu) ద‌ర్శ‌క‌త్వంలో #SK25 చిత్రంలో న‌టించ‌నున్నారు. ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం శివకార్తికేయన్ (Siva Karthikeyan) నటిస్తున్న రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

GRpvtxGXAAEZZA4.jpeg


వీటిలో ఒకటి రాజ్‌కుమార్‌ పెరియస్వామి (Raj Kumar Periyasamy) దర్శకత్వం వహించిన ‘అమరన్‌’ ఒకటి. ఈ సినిమాను సెప్టెంబరు 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్‌.

cibi.jpg

అలాగే, ఏ.ఆర్‌.మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో శివకార్తికేయన్ (Siva Karthikeyan) నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతుండగా హీరో శివకార్తికేయన్‌ తన 24 #SK24 వ చిత్రంపై దృష్టిని కేంద్రీకరించారు.

Updated Date - Jul 07 , 2024 | 07:50 AM