Vijay Antony: నా కేరీర్‌లోనే భారీ చిత్రం ‘తుఫాన్’

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:30 PM

నా కేరీర్‌లోనే భారీ చిత్రం ‘తుఫాన్’ అని న‌టుడు విజ‌య్ అంటోని అన్నారు. ఆయ‌న హీరోగా మేఘా ఆకాష్ క‌థానాయిక‌గా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం ‘మళై పిడిక్కాద మణిదన్‌’ తెలుగులో తుఫాన్ పేరుతో విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు.

toofan

విజయ్‌ ఆంటోనీ (vijay antony) హీరోగా, మేఘా ఆకాష్ (Megha Akash) క‌థానాయుక‌గా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం ‘మళై పిడిక్కాద మణిదన్‌’ ( Mazhai Pidikatha Manithan) తెలుగులో తుఫాన్ (Toofan) పేరుతో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ‌ డైరెక్ట‌ర్ విజ‌య్ మిల్ట‌న్ (sd.vijay milton) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రంలో స‌త్య‌రాజ్ (Sathyaraj), శ‌ర‌త్ కుమార్ ( Sarath Kumar), ముర‌ళీ శ‌ర్మ (Murali Sharma ) ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇన్ఫినిటీ వెంచర్స్‌ (Infiniti Film Ventures) పతాకంపై కమల్‌ బోరా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, డి.లలిత సంయుక్తంగా నిర్మించారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవ‌ల చెన్నైలో విడుదల చేశారు.

GRPksKPW0AAE50l.jpeg


ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు విజయ్‌ మిల్టన్ (sd.vijay milton) మాట్లాడుతూ.. విజ‌య్ అంటోని ‘రోమియో’ చిత్రం ప్రారంభించే సమయంలోనే ఈ సినిమా కూడా మొదలుపెట్టాం. కథపై నమ్మకంతో నాతో కలిసి ప్రయాణం చేసిన చిత్ర బృందానికి ధన్యవాదాలు. సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ ధన్యవాదాలు’ తెలిపారు. నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి గడిచిపోయిన కాలం.. మరో వ్యక్తి భవిష్యత్‌ అని చెబుతుంటారు. అలాంటిదే ఈ చిత్ర కథ. ట్రైలర్‌ తరహాలోనే సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది’ అని పేర్కొన్నారు.

GRPrGihX0AAIgcN.jpeg

హీరో విజయ్‌ ఆంటోనీ (vijay antony) మాట్లాడుతూ, ‘నా స్నేహితుడు విజయ్‌ మిల్టన్ (sd.vijay milton)తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. దేశంలోనే ది బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ ఒకరు. నేను ఇప్పటివరకు నటించిన చిత్రాల్లోకెల్లా భారీ చిత్రం. ఇదేన‌న్నారు. శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌, శరణ్య మురళిశర్మ, డాలి ధనుంజయన్‌ వంటి వారితో కలిసి నటిస్తానని ఊహించలేదన్నారు.

Updated Date - Jul 03 , 2024 | 12:33 PM