Shocking: భార్యకు విడాకులిచ్చిన దర్శకుడు.. వీళ్లకేమైంది

ABN , Publish Date - Dec 13 , 2024 | 09:06 AM

ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలోని వారికి ఏమవుతుందో తెలియదు కానీ.. ఎన్నో ఏళ్ల బంధానికి ఈజీగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే ధనుష్, జయం రవి, ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్ వంటి వారంతా విడాకుల బాట పట్టగా.. ఇప్పుడీ లిస్ట్‌లోకి మరో దర్శకుడు చేరారు. ఆ దర్శకుడు ఎవరంటే..

Couple Divorce

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శీను రామస్వామి తన భార్యకు విడాకులిచ్చారు. ఈ విషయాన్ని ఆయన గురువారం తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించి సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మధ్యకాలంలో సినీ కుటుంబానికి సంబంధించి విడాకుల వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ధనుష్, జయం రవి, ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాశ్ వంటి వారంతా విడాకుల (Divorce) బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లిస్ట్‌లోకి శీను రామస్వామి (Director Seenu Ramasamy) కూడా చేరారు. తాజాగా ఆయన

Also Read-Game Changer: ‘గేమ్ చేంజర్’ అమెరికా ఈవెంట్ గెస్ట్ ఎవరో తెలుసా.. ‘పుష్ప’

‘ప్రియమైన వారికి నమస్కారాలు.. నా భార్య జీఎస్‌ దర్షన నేను 17 యేళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. మేమిద్దరం కలిసి, పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయం ఇది. ఇక నుంచి వేర్వేరుదారుల్లో నడవాలని, ఈ క్రమంలో దర్షన ప్రవర్తన నన్నుగానీ, నా వ్యవహారశైలి ఆమెను గానీ ఏవిధంగానూ అడ్డురావని తెలియజేస్తున్నాను. మాకు విడాకులు మంజూరు చేయాలని మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాం. మా ఇద్దరి వ్యక్తిగత నిర్ణయానికి, ఆ హక్కును గౌరవిస్తూ మీ మద్దతును కోరుతున్నాం’ అని పేర్కొన్నారు.


Seenu-Ramasamy.jpg

దిగ్గజ దర్శకుడు బాలు మహేంద్ర (Balu Mahendra) వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన శీను రామస్వామి 2007లో వచ్చిన ‘కూడల్‌ నగర్‌’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు ఆ తర్వాత ‘తెన్‌మేర్కు పరువకాట్రు’ మూవీతో విజయ్‌ సేతుపతికి ఓ స్టార్‌ ఇమేజ్‌ అందించారు. పిమ్మట ‘నీర్‌ పరవై’, ‘ధర్మదురై’, ‘కన్నే కలైమానే’, ‘మామనిదన్‌’, ‘కోళిపన్నై చెల్లదురై’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారు. అలాగే, ఈయన దర్శకత్వం వహించిన ‘ఇడిముళక్కం’, ‘ఇడం పొరుల్‌ ఏవల్‌’ సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు విడాకుల వార్తలతో శీను రామస్వామి పేరు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

Also Read-Allu Arjun: నంద్యాల వాటర్ వంటపట్టిందా.. సుకుమార్ పేరు కూడా తెలియదా

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2024 | 09:06 AM