Hanuman: ‘హనుమాన్‌’తో కలిసి సంక్రాంతిని జరుపుకుందాం

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:33 PM

‘హనుమాన్‌’తో కలిసి సంక్రాంతి పండుగను ప్రేక్షకులు జరుపుకోవాలని కోలీవుడ్ ప్రముఖ నిర్మాత, శక్తి ఫిలిమ్స్‌ అధినేత శక్తివేలన్‌ కోరారు. ఆయన ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో విడుదల చేస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ నెల 12న సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేస్తున్నారు.

Hanuman: ‘హనుమాన్‌’తో కలిసి సంక్రాంతిని జరుపుకుందాం
Hanu-Man Team

‘హనుమాన్‌’ (Hanu-Man)తో కలిసి సంక్రాంతి పండుగను ప్రేక్షకులు జరుపుకోవాలని కోలీవుడ్ ప్రముఖ నిర్మాత, శక్తి ఫిలిమ్స్‌ అధినేత శక్తివేలన్‌ (Producer Sakthivelan) కోరారు. ఆయన ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో విడుదల చేస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ నెల 12న సంక్రాంతిని పురస్కరించుకుని విడుదల చేస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్‌ జంటగా నటించగా, విలన్‌గా వినయ్‌రాయ్‌ నటించారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రను పోషించారు. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్‌, స్పానిష్‌, కొరియన్‌, జపనీస్‌, చైనీస్‌ భాషల్లో పాన్‌ వరల్డ్‌ స్థాయిలో తెరకెక్కించారు. అనుదీప్‌ దేవ్‌, హరిగౌడ, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్ర బృందం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించింది.


Hanuman.jpg

ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జా (Teja Sajja) మాట్లాడుతూ.. ‘ఈ సినిమా డైరెక్ట్‌ తమిళ్‌ మూవీలా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే ఈ సినిమా క్వాలిటీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఒక ఫిక్షనల్‌ మూవీ. ఇందు కోసం ‘అంజనాద్రి’ అనే యూనివర్సల్‌ వరల్డ్‌ను సృష్టించాం. ఒక యువకుడికి హనుమంతుడి వల్ల అతీత శక్తులు లభించడమే ఈ చిత్ర కథ’ అని అన్నారు. హీరోయిన్‌ అమృత అయ్యర్‌ మాట్లాడుతూ... ‘నిజానికి ఈ సినిమాను తెలుగులోనే ప్లాన్‌ చేశారు. ఆ తర్వాత పాన్‌ వరల్డ్‌ మూవీగా మారిపోయింది. దీనికి కారణం హనుమాన్‌ ఆశీర్వాద బలమే. భారతీయ చిత్రపరిశ్రమ గర్వపడేలా ఈ మూవీ ఉంటుంది’ అని అన్నారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ... ‘మన దేశంలోనే తొలిసారి తెరకెక్కిన సూపర్‌ హీరో చిత్రం. ట్రైలర్‌ కంటే ఎన్నో రెట్లు కొత్తగా ఉంటుంది. కొన్ని సినిమా విజువల్స్‌ను థియేటర్లలోనే చూడాలి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..

*************************

*కెప్టెన్‌ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?

*************************

*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి

***********************

*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..

**************************

Updated Date - Jan 07 , 2024 | 08:33 PM