Black: రిలీజ్ తర్వాత ఏ సినిమా రీమేకో చెబుతారట..
ABN , Publish Date - Oct 10 , 2024 | 09:12 PM
ఎన్ని రీమేక్ సినిమాలు వచ్చినా మన హీరోలతో ఒరిజినల్ స్టోరీలతోనే సినిమా చేయాలని భావిస్తాం. కానీ, తొలిసారి రీమేక్‌ను టచ్ చేశాం. రిలీజ్ తర్వాత ఇది ఏ సినిమా రీమేకో చెబుతామంటున్నారు ‘బ్లాక్’ మూవీ నిర్మాత. తాజాగా జరిగిన వేడుకలో ఆయన ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
తొలిసారి ఓ రీమేక్‌ను టచ్ చేశామనీ, అది కూడా హాలీవుడ్ మూవీ అని ‘బ్లాక్’ (Black) చిత్ర నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు (SR Prabhu) అన్నారు. డెబ్యూ డైరెక్టర్ జి.బాలసుబ్రమణి దర్శకత్వంలో జీవా (Jiiva), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన చిత్రం ‘బ్లాక్’. పొటెన్షియల్ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. ఈ నెల 11న విడుదల కానున్న ఈ చిత్ర బృందం చెన్నై నగరంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసింది.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
హీరో జీవా మాట్లాడుతూ.. ‘‘గత 21 యేళ్ళుగా సినిమాల్లో ఉన్నాననీ, నన్ను వృద్ధుడిగా చూడొద్దు. నా తొలి పదేళ్ళలో ప్రయోగాత్మక చిత్రాలు చేశాను. ఆ కోణంలో రాబోయే చిత్రమే ‘బ్లాక్’. ఇందులో తక్కువ పాత్రలే ఉంటాయి. కానీ, అభిమానులను అమితంగా ఆకర్షిస్తాయి. సూర్య, కార్తీ వంటి స్టార్ హీరోలు తన వద్ద ఉన్నప్పటికీ నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు.. ఇలాంటి బలమైన కథతో నాతో సినిమా తీసినందుకు ధన్యవాదాలని’’ అన్నారు
నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందే.. ఇది ఆ సినిమాకు రీమేక్, ఈ సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం సాగింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు నిర్మించాం. ఎన్ని రీమేక్ సినిమాలు వచ్చినా మన హీరోలతో ఒరిజినల్ స్టోరీలతోనే సినిమా చేయాలని భావిస్తాం. కానీ, తొలిసారి రీమేక్‌ను టచ్ చేశాం. అదీ కూడా ఒక హాలీవుడ్ మూవీని జీవా హీరోగా రీమేక్ చేశాం. ఇది ఏ హాలీవుడ్ సినిమా అనేది రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇలాంటి రీమేక్‌లను కూడా ఎంతో అందంగా తీయగలమని దర్శకుడు బాలసుబ్రమణి నిరూపించాడని తెలిపారు.
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?
దర్శకుడు బాలసుబ్రమణి మాట్లాడుతూ.. ఈ కథను చాలా మంది హీరోలకు వివరించాను. వారంతా పెద్దగా ఆసక్తి చూపలేదు. జీవాకు వివరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని, చివరివరకు దానికే కట్టుబడివున్నారు. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత ప్రభుకు ఎన్నటికీ రుణపడివుంటానని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గోకుల్, ఫిలోమిన్ రాజ్, వివేక్ ప్రసన్న తదితరులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.