నా భార్య మాటలు నిజమయ్యాయి: హీరో అశోక్‌ సెల్వన్‌

ABN , Publish Date - Feb 02 , 2024 | 09:33 PM

‘బ్లూస్టార్‌’ విజయంతో తన భార్య చెప్పిన మాటలు నిజమయ్యాయని హీరో అశోక్‌ సెల్వన్‌ అన్నారు. సుధీర్ఘకాలంగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లో చప్పట్లు కొడుతూ ఎంజాయ్‌ చేసిన సందర్భాలు లేవని, కానీ ఈ చిత్రంలో ఆ కోరిక తీరిపోయిందన్నారు. జయకుమార్‌ దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌, సంతాను భాగ్యరాజ్‌, పృథ్వి, కీర్తీ పాండ్యన్‌, దివ్య తదితరులు నటించిన ‘బ్లూస్టార్‌’ చిత్రం గత వారమే విడుదలైంది.

నా భార్య మాటలు నిజమయ్యాయి: హీరో అశోక్‌ సెల్వన్‌
Ashok Selvan and Keerthi Pandian

‘బ్లూస్టార్‌’ విజయంతో తన భార్య చెప్పిన మాటలు నిజమయ్యాయని హీరో అశోక్‌ సెల్వన్‌ అన్నారు. సుధీర్ఘకాలంగా అనేక చిత్రాల్లో నటించినప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లో చప్పట్లు కొడుతూ ఎంజాయ్‌ చేసిన సందర్భాలు లేవని, కానీ ఈ చిత్రంలో ఆ కోరిక తీరిపోయిందన్నారు. జయకుమార్‌ దర్శకత్వంలో అశోక్‌ సెల్వన్‌, సంతాను భాగ్యరాజ్‌, పృథ్వి, కీర్తీ పాండ్యన్‌, దివ్య తదితరులు నటించిన ‘బ్లూస్టార్‌’ గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. దీంతో ఈ చిత్రయూనిట్‌ సభ్యులు తాజాగా చెన్నై నగరంలో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఇందులో యూనిట్‌ సభ్యులంతా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అశోక్‌ సెల్వన్‌ మాట్లాడుతూ.. ‘నీకూ ఒక సమయం వస్తుంది, అపుడు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ సినిమాను చూస్తారంటూ’ నా నిజ జీవిత ప్రియురాలు, భార్య కీర్తిపాండ్యన్‌ పదేపదే చెబుతుంది. ఆ మాటలు ఇపుడు నిజమయ్యాయి. ఏ థియేటర్‌కు వెళ్ళిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం చేసిన ప్రేక్షకదేవుళ్ళకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.


Shanthanu.jpg

మరో హీరో సంతాను మాట్లాడుతూ.. నేను సక్సెస్‌ అనే వార్త విని 5600 రోజులైంది. ‘చక్కరకట్టి’ చిత్రం తర్వాత విజయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి అది ‘బ్లూస్టార్‌’ రూపంలో దక్కింది. ‘నేను అనేక మందిని వెండితెరకు పరిచయం చేశాను. కానీ, నా కుమారుడికి సరైన సక్సెస్‌ లేదు’ అంటూ నా తండ్రి భాగ్యరాజ్‌ తీవ్ర మనోవేదన చెందుతూ కన్నీరు కూడా కార్చారు. ఆయన బాధను ఈ చిత్రం తొలగించింది. చిత్ర బృందానికి ఆయన కృతఙ్ఞత లేఖను కూడా రాశారు. మా అమ్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. చిన్న వయసులో క్రికెటర్‌ కావాలన్నది నా కోరిక కానీ అది సాధ్యం కాలేదు. ఈ సినిమాలో క్రికెటర్‌గా నటించడం చాలా సంతోషం కలిగించిందని అన్నారు. నిర్మాత పా.రంజిత్‌, దర్శకుడు జయకుమార్‌, హీరోయిన్‌ కీర్తిపాండ్యన్‌ తదితరులు ప్రసంగించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Simbu and Varalaxmi: శింబుతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి.. వారిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

****************************

*‘లాల్‌సలాం’కు ధన్య బాలకృష్ణ రూపంలో చిక్కులు?.. సారీ చెప్పిన నటి..!

***************************

*HanuMan: 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా రికార్డ్

****************************

*Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్‌

*****************************

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

Updated Date - Feb 02 , 2024 | 09:33 PM