‘అంజాం వేదం’లో అన్నీ ఉంటాయ్.. రిలీజ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Feb 17 , 2024 | 11:51 PM
విహాన్ విష్ణు - సును లక్ష్మి జంటగా నటించిన ‘అంజాం వేదం’ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమైంది. తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ముజీబ్ టి.మొహమ్మద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత హబీబ్ అబూబాకర్ నిర్మించగా, సాగర్ అయ్యప్పన్ ఛాయాగ్రహణం సమకూర్చారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు ముజీబ్ డి మహమ్మద్ వివరిస్తూ, ‘ఒక కుటుంబం, ఒక వ్యక్తి జీవితంలో మతం జోక్యం ఎలా ఉంటుందన్న విషయాన్ని వివరిస్తుంది. ఇందులో అనేక రహస్యమైన చిక్కులు, ట్విస్టులు, పజిల్స్, మలుపులున్నాయి. కేరళ రాష్ట్రంలోని ఒక గిరిజన గ్రామంలో చిత్రీకరించాం. మతపరమైన సిద్ధాంతాలు, విశ్వాసాలు, ఛాందసవాదం, హింస తదితర అంశాలను కూడా టచ్ చేస్తుంది. ప్రతి సీన్ ఎంతో ఉత్కంఠతకు గురిచేస్తుంది.
రెండు తమిళ చిత్రాలకు పనిచేసిన పినీష్ రాజ్.. ఈ చిత్రానికి సంభాషణలు రాయడంతో పాటు కో-డైరెక్టరుగా పనిచేశారు. ఈ సినిమాలో ప్రారంభం నుంచి ముగింపువరకు కనిపించే అనేక అందమైన లొకేషన్లు పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీతో సృష్టించాం. సాధారణంగా చిన్న చిత్రాలకు భారీ వ్యయంతో కూడిన వీజువల్ ఎఫెక్ట్స్ టెక్నాలజీని ఉపయోగించరు. కానీ, ప్రేక్షకులకు సరికొత్త అనుభవం అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ టెక్నాలజీని ఉపయోగించాం’ అని వివరించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Aa Okkati Adakku: తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది
**************************
*Vijay Deverakonda: ఫోర్బ్స్ లిస్ట్‌లో రష్మికకు చోటు.. విజయ్ స్పందనిదే..
****************************