Andhagan: ‘అంధగన్‌’ రీమేక్‌ కాదు.. రీమేడ్‌!

ABN , Publish Date - Jul 27 , 2024 | 07:12 PM

టాప్‌స్టార్‌ ప్రశాంత్‌ - ప్రియా ఆనంద్‌ జంటగా నటించిన ‘అంధగన్‌’ చిత్రం రీమేక్‌ కాదని.. రీమేడ్‌ అని ఆ చిత్ర దర్శక నిర్మాత త్యాగరాజన్‌ పేర్కొన్నారు. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘అంధాధున్‌’ చిత్రాన్ని స్టార్‌ మూవీస్‌ పతాకంపై తమిళంలో తెరకెక్కించారు. వచ్చే నెల 15వ తేదీ విడుదల చేయనున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను తాజాగా మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘అంధగన్‌ అంతం’ పేరుతో సాగే ప్రొమో సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు.

Andhagan Movie Song Launch Event

టాప్‌స్టార్‌ ప్రశాంత్‌ (Prashanth) - ప్రియా ఆనంద్‌ (Priya Anand) జంటగా నటించిన ‘అంధగన్‌’ (Andhagan) చిత్రం రీమేక్‌ కాదని.. రీమేడ్‌ అని ఆ చిత్ర దర్శక నిర్మాత త్యాగరాజన్‌ (Thiagarajan) పేర్కొన్నారు. హిందీలో సూపర్‌ హిట్‌ అయిన ‘అంధాధున్‌’ చిత్రాన్ని స్టార్‌ మూవీస్‌ పతాకంపై తమిళంలో తెరకెక్కించారు. వచ్చే నెల 15వ తేదీ విడుదల చేయనున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ను తాజాగా మేకర్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘అంధగన్‌ అంతం’ పేరుతో సాగే ప్రొమో సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా (Prabhu Deva) నృత్యం సమకూర్చగా, సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఆలపించారు. ఈ పాట చెన్నై నగరంలో జరిగిన కార్యక్రమంలో రిలీజ్‌ చేశారు. ఇందులో ప్రశాంత్‌, ప్రియా ఆనంద్‌, త్యాగరాజన్‌, దర్శక నటుడు కేఎస్‌ రవికుమార్‌, నటి ఊర్వశి, నటి వనిత, నటుడు చిత్రాలక్ష్మణన్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read- K Vijaya Bhaskar: మరో ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా ఇది..


ఈ కార్యక్రమంలో దర్శకుడు త్యాగరాజన్‌ మాట్లాడుతూ.. ‘‘2019లో తీవ్రపోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ సొంతం చేసుకున్నాను. కరోనాతో పలు కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగింది. నటి సిమ్రన్‌ (Simran) నెగెటివ్‌ షేడ్‌లో నటించారు. నటి వనితా విజయకుమార్‌కు ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది. ఆమె గయ్యాళి భార్యగా నటుడు సముద్రఖని జంటగా నటించారు. సీనియర్‌ నటుడు కార్తీక్‌ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో వచ్చే ప్రతి చిన్న పాత్ర కథకు అనుగుణంగా చిత్రీకరించాం. యోగిబాబుకు సోదరిగా నటి ఊర్వశి నటించారు. ఆమె నాతో కలిసి కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఊర్వశి, యోగిబాబు, కేఎస్‌ రవికుమార్‌, సముద్రఖని, ప్రశాంత్‌, సిమ్రన్‌, ప్రియా ఆనంద్‌, కార్తీక్‌ ఇలా ఎంతో మంది నటులు ఇందులో నటించారు. ఇందులో హిందీ వెర్షన్‌లో లేని అనేక అంశాలు తమిళంలో ఉన్నాయి. అందుకే ఇది రీమేక్‌ కాదు.. రీమేడ్‌’’ అని అన్నారు. (Thiagarajan Movie)


Andhagan.jpg

హీరో ప్రశాంత్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రోమో సాంగ్‌ విడుదల చేసిన నటుడు విజయ్‌ (Vijay)కు ధన్యవాదాలు. అడగ్గానే ఆయన పెద్దమనసుతో అంగీకరించారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. అలాంటి తరుణం కోసం నేను ఎదురుచూస్తున్నానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేఎస్‌ రవికుమార్‌, ఊర్వశి, ప్రియా ఆనంద్‌, వనిత తదితరులు ప్రసంగించారు. (Andhagan Song Launch Event)

Read Latest Cinema News

Updated Date - Jul 27 , 2024 | 07:12 PM