Rambha: ట్రెండింగ్‌లో రంభ‌.. విజ‌య్‌తో ఫ్యామిలీ సెల్ఫీ!ఫొటోలు వైర‌ల్

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:24 PM

చాలాకాలం త‌ర్వాత క‌థానాయిక రంభ సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా త‌మిళ స్టార్ విజ‌య్ లేటెస్ట్ మూవీ షూటింగ్ విదేశాల‌లో జ‌రుగుతున్న క్ర‌మంలో రంభ హీరోను క‌లిసిన ఫొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

rambha

చాలాకాలం త‌ర్వాత క‌థానాయిక రంభ (Rambha) సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తోంది. గ‌త కొంతకాలంగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చినప్ప‌టికీ ఎన్న‌డు అధికార ప్ర‌క‌ట‌న రాలేదు. ఆ త‌ర్వాత ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో నెట్టింట క‌నిపించిన రంభ మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఓ యాక్సిడెంట్ వార్త‌తో అప్ప‌ట్లో బాగా వార్త‌ల్లో క‌నిపించిన రంభ త‌ర్వాత మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తోంది.

Rambha.jpg

రంభ (Rambha) చివ‌ర‌గా తెలుగులో 2008లో దొంగ‌ స‌చ్చినోల్లు అనే కామెడీ చిత్రంలో న‌టించింది. 2010లో శ్రీలంక‌కు చెందిన త‌మిళ వ్యాప‌ర‌వేత్త ఇంద్ర కుమార్ ప‌ద్మ‌నాధ‌న్ (Indrakumar Pathmanathan)ను వివాహం చేసుకోగా ఈ జంట కెన‌డాలో స్థిర ప‌డింది.

GSrY5vpWwAAiFWh.jpeg

వీరికి ఇద్ద‌రు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. అయితే 2010 త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న రంభ 2014,2107 వ‌ర‌కు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది.


తాజాగా త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy VIJAY ) న‌టిస్తోన్న చిత్రం గోట్ (గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్ టైం) చిత్రీక‌ర‌ణ విదేశాల‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

GSrNuE8aAAAD4WM.png

ఈక్ర‌మంలో న‌టి రంభ (Rambha) త‌న ఫ్యామిలీతో క‌లిసి విజ‌య్‌ను క‌లిసింది. ఇప్పుడు ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. గ‌తంలో రంభ విజ‌య్‌తో క‌లిసి నాలుగు చిత్రాల‌లో క‌లిసి న‌టించ‌గా అవి మంచి విజ‌యం సాధించడం విశేషం.

GSrNwtJacAEoUt2.png

Updated Date - Jul 17 , 2024 | 03:25 PM

Radhika Apte: ఓటీటీలో బాల‌య్య బ్యూటీ న్యూడ్‌గా న‌టించిన సినిమా! తెలుగులోనూ ట్రెండింగ్‌

Ruhani Sharma: ఇదేంద‌య్యా ఇది.. ఎప్పుడు చూడ‌లా! మంట‌లు రేపుతున్న రుహానీ

Priya Banerjee: రానా బ్యూటీ.. కంటెంటు గ్యారెంటీ! 

Raashii Khanna: చీరను ఇలా కూడా కట్టొచ్చా.. రాశీఖన్నా

AyeshaKhan: ఎవరీ అయేషా ఖాన్?.. ఇప్పుడు యూత్‌ను ఊపేస్తోంది