Ineya: క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నుంచి.. హీరోయిన్‌గా దూసుకెళుతున్న ‘ఇనియా’

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:10 AM

త‌మిళ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇన‌యా. సీరియ‌ల్ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతుంది.

inaya

త‌మిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించిన నటి ఇనియా (Ineya)కు ఇపుడు హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నాయి. ఆమె తాజాగా హీరోయిన్‌గా నటించిన ‘సీరన్‌’ (Seeran) చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. జేమ్స్‌ కార్తీక్ (James Karthik) కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూర్చి, సొంతంగా నిర్మించారు. దురై కె.మురుగన్ (DuraiK Murugan) దర్శకత్వం వహించారు. సోనియా అగర్వాల్‌ కీలక పాత్ర పోషించారు.

GNUCwncaYAAp_hQ.jpeg

సమాజంలోని హెచ్చుతగ్గులు, ప్రతి ఒక్కరికీ సమాన హక్కులను ప్రధానంగా ప్రస్తావిస్తూ సాగే ఒక మంచి కమర్షియల్‌ చిత్రంగా రూపొందించారు. అలాగే మరో రెండు మూడు చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి.

GLPwRUtacAAyTbS.jpeg

కాగా, ‘వాగైసూడవ’ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన ఇనియా.. ఆ తర్వాత ‘మౌనగురు’, ‘అమ్మావిన్‌ కైపేసి’, ‘కణ్‌ పేసుం వార్తైగల్‌’, ‘మాసాని’, ‘నాన్‌ సిగప్పు మణిదన్‌’, ‘నాన్‌ కడవుల్‌ ఇల్లై’ ‘బొట్టు’ వంటి చిత్రాల్లో నటించారు.


E-W8oQ2UYAUoOa5.jpeg

గత కొంతకాలంగా హీరోయిన్‌గా ఇనియా (Ineya)కు సరైన అవకాశాలు లేవు. గత మూడేళ్ళకాలంలో ఆమె కేవలం ఒకే ఒక చిత్రంలో నటించారు. కానీ, ఇపుడు ఆమెకు వరుస సినీ అవకాశాలు వస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ExkEBauU4AE-a-b.jpeg

Updated Date - Jul 05 , 2024 | 10:29 AM