DNA Movie: ఒక చిత్రం.. ఐదుగురు సంగీత దర్శకులు!

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:57 PM

అధర్వ మురళి, నిమి షా సజయన్ జంటగా నటిస్తున్న ‘డీఎన్‌ఏ’. ఈ చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తుండ‌డం విశేషం.

dna

అధర్వ మురళి (Atharvaa murali), నిమి షా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటిస్తున్న ‘డీఎన్‌ఏ’ (DNA movie ) చిత్రానికి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ‘ఫర్హానా’ ఫేం నెల్సన్‌ వెంకటేశన్ (Nelson Venkatesan) కథ సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు.

ఒలింపియా మూవీస్ (Olympia Movies) పతాకంపై ఎస్‌.అంబేత్‌ కుమార్ (Ambeth Kumar Vandavasi ) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ పనులన్నీ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

GRukUr1bUAEXcUV.jpeg


సాధారణంగా ఒక చిత్రానికి ఒక సంగీత దర్శకుడు పనిచేస్తుంటారు. కానీ, ఈ సినిమాకు మాత్రం ఏకంగా సత్యప్రకాష్ (Sathya prakash), శ్రీకాంత్‌ హరిహరన్ (D Sreekanth Hariharan), ప్రవీణ్‌ షైవి ( Pravin Saivi), సహి శివ (Sahi Siva), అనల్‌ ఆకాష్ (Anal Akash) అనే ఐదుగురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పనిచేయడం గమనార్హం. చిత్రంలోని ఐదు పాటల్లో ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు చొప్పున మొత్తం ఐదుగురు సంగీత దర్శకులు సంగీత బాణీలను సమకూర్చారు.

Updated Date - Jul 09 , 2024 | 09:58 PM