Swara Bhasker: హీరోలు, దర్శకనిర్మాలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది!

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:47 PM

హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) బయట పెట్టిన అంశాలపై బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌(Swara Bhaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలో వెల్లడించిన షాకింగ్‌ విషయాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.


హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) బయట పెట్టిన అంశాలపై బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌(Swara Bhaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. నివేదికలో వెల్లడించిన షాకింగ్‌ విషయాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ సభ్యులను ఆమె ప్రశంసించారు. వారి వల్లే ఈ కమిటీ ఏర్పడిందని, మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు (women's Safety)ఎదుర్కొంటున్న ఇబ్బందులు బయటపడ్డాయని తెలిపారు.

‘‘హేమ కమిటీ నివేదికలోని పలు విషయాలు చదివి నేను షాకయ్యా. మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి నా హృదయం ముక్కలైంది. ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. ఇది రిస్క్‌తో కూడుకున్నది కూడా. సినిమా ప్రారంభం నుంచి విడుదలయ్యే వరకూ ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎవరైనా మహిళలు ఇలాంటి సంఘటనల గురించి పెదవి విప్పినా పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నటులు, నిర్మాతలు, దర్శకులను అందరూ దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. వారు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే.. అక్కడ ఎటువంటి నియమాలు వర్తించవు. ఎవరైనా దాని గురించి బయటకు వచ్చి గట్టిగా తమ స్వరాన్ని వినిపిస్తే .. వారిని ట్రబుల్‌ మేకర్స్‌ అని ముద్ర వేసేస్తారు. అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Swara-bhaskar.jpg
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదిక చర్చనీయాంశంగా మారింది. పలు చిత్ర పరిశ్రమ?కు చెందిన నటీనటులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.   ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలని నటి మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. 

Updated Date - Aug 28 , 2024 | 12:47 PM