Suriya44: కంగువా విడుద‌లే కాలే.. సూర్య‌ అప్పుడే ఇంకో సినిమా పూర్తి చేశాడు

ABN , Publish Date - Oct 07 , 2024 | 08:44 PM

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హీరో సూర్య న‌టిస్తోన్న 44వ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు.

suriya

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో హీరో సూర్య (Suriya) న‌టిస్తోన్న 44వ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా సహ నిర్మాతలుగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం వ్యవహరిస్తున్నారు.

GZN8Lv-awAA7f92.jpeg

సూర్య సరసన పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

GZOjCkXaAAA512J.jpeg

సూర్య (Suriya) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సూర్య44 గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సూర్య ఫ్రెంచ్ గడ్డంతో, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు.ఈ గ్లింప్స్ సినిమా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

WhatsApp Image 2024-10-07 at 5.00.18 PM.jpeg

ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున, మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ వ్రాప్ చేస్తూ దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

GZNjYAsW0AAykTv.jpeg

Updated Date - Oct 07 , 2024 | 08:44 PM