Sujitha - Surya Kiran: మరో జన్మ ఉంటుందనే మాట నిజమైతే..
ABN , Publish Date - Mar 15 , 2024 | 05:08 PM
టాలీవుడ్ దర్శకుడు సూర్య కిరణ్ మరణం పట్ల తన సోదరి, నటి సుజిత భావోద్వేగంగా పోస్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో ఓ నోట్ పెట్టింది.
టాలీవుడ్ దర్శకుడు సూర్య కిరణ్ (Surya kiran) మరణం పట్ల తన సోదరి, నటి సుజిత (Sujitha dhanush) భావోద్వేగంగా పోస్ట్ చేసింది. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో ఓ నోట్ పెట్టింది. "అన్నయ్య నీ మరణవార్త గుండె పగిలేలా చేసింది. నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. నువ్వు నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు. నాకు తండ్రితో సమానం. నా హీరో కూడా నువ్వే. నీ మాటలకి, నీ టాలెంట్‌కి నేను ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉంటాను. మరో జన్మ ఉంటే నువ్వు కన్న కలలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుజిత పోస్ట్ పెట్టారు. సూర్య కిరణ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది సుజిత. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మీరు ధైర్యంగా ఉండాలి సుజిత అని ఆమెను ఓదార్చుతున్నారు. (Sujitha emotional post)
కొద్దిరోజులుగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న సూర్య కిరణ్ ఈ నెల 11న తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా మెప్పించిన ఆయన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ‘ధన 51, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్’, ‘చాప్టర్ 6’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టారు.
హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. తెలుగులో ‘రాక్షసుడు’, ‘దొంగమొగుడు’, ‘స్వయం కృషి’, ‘సంకీర్తన’, ‘ఖైదీ నం.786’, ‘కొండవీటి దొంగ’ చిత్రాల్లో నటించారు. దర్శకుడుగా వరుస పరాజయాలు ఎదురుకావడం, నిర్మాతగా ఓ సినిమా తీసి నష్టపోవడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణికి దూరం అయ్యారు. దాంతో చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరమైపోయారు సూర్య కిరణ్.