Sai Pallavi: శివ కార్తికేయన్‌ని బాధపెట్టిన సాయి పల్లవి
ABN , Publish Date - Oct 19 , 2024 | 08:47 AM
అమరన్ ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. సాయి పల్లవి నన్ను అన్న మాటలకు చాలా బాధపడ్డ అన్నారు. ఇంతకీ ఏమైందంటే..
శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)కు చెందిన RKFI అండ్ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం అమరన్ (Amaran). నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar) దర్శకత్వం వహించగా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంచ్ చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. సాయి పల్లవి నన్ను అన్న మాటలకు చాలా బాధపడ్డ అన్నారు. ఇంతకీ ఏమైందంటే..
తాజాగా చెన్నైలో గ్రాండ్‌గా జరిగిన ఈ చిత్ర ఆడియో లాంచ్‌కి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ‘‘మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి మొదట వార్తల్లో విన్నా. రాజ్ కుమార్ ఈ కథను వివరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యా. ముకుంద్ గొప్ప లీడర్. కశ్మీర్‌లో 100రోజుల పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాం. రాత్రిపూట కావడంతో చలి ఎక్కువగా ఉండేది. ఈ చిత్రం క్లైమాక్స్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ముకుంద్ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని అందరూ గౌరవించేలా దీన్ని తీర్చిదిద్దాం. ఈ సినిమా కోసం ఆయన కుటుంబాన్ని సంప్రదించినప్పుడు తమిళ హీరోతోనే తీయాలని వాళ్లు కోరారు. ముకుంద్‌కు తమిళ పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమని అన్నారు. నేను ఓ టీవీ ఛానల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను వ్యాఖ్యతగా వ్యవహరించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్. ‘ప్రేమమ్’లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా. ఫోన్ చేసి ప్రశంసించా. ఆమె వెంటనే ‘థ్యాంక్యూ అన్నా’ అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీలయ్యాను. ఆమె గొప్ప నటి’’ అని అన్నారు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash,) సంగీతం అందిస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31న ఈ అమరన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.