Amaran: శివకార్తికేయన్ ‘అమరన్‌’ రెడీ

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:58 PM

శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్‌’ చిత్రం డబ్బింగ్‌ పూర్తయినట్టు విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

amaran

శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించిన ‘అమరన్‌’ (Amaran) చిత్రం డబ్బింగ్‌ పూర్తయినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సాయి ప‌ల్ల‌వి ( Sai Pallavi) క‌థానాయిక చేసిన ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్టు తెలిపింది. సోనీ పిక్చర్‌తో కలిసి విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ (RKFI) పతాకంపై నిర్మించారు. ‘రంగూన్‌’ ఫేం రాజ్‌కుమార్‌ పెరియస్వామి Rajkumar Periasamy) దర్శకుడు. మునుపెన్నడూ చూడని అవతార్‌, ఇంటెన్స్ క్యారెక్టర్‌లో శివకార్తికేయన్ ఈ మూవీలో కనిపించబోతుండ‌డం విశేషం.

GGiZLa_WUAAr57N.jpeg

కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ : ట్రూ స్టోరీస్‌ ఆఫ్‌ మోడరన్‌ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా ఈ స్క్రిప్టును సిద్ధం చేశారు. శివకార్తికేయన్‌ సైనికుడి పాత్రలో నటించారు. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ రూ.55 కోట్లకు కొనుగోలు చేసుకున్నట్టు సమాచారం. సాయిపల్లవి హీరోయిన్‌. అక్టోబరు 31వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రం డబ్బింగ్‌ పూర్తయినట్టు చిత్రబృందం ప్రకటించింది.

GXbilzwWoAAIETB.jpeg

జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash,) సంగీతం అందిస్తుండ‌గా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, అన్బరివ్ మాస్టర్స్‌తో పాటు స్టీఫన్ రిక్టర్ యాక్షన్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అక్టోబర్ 31న ఈ అమ‌ర‌న్ (Amaran) చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Updated Date - Sep 18 , 2024 | 04:58 PM