Suchi Leaks: ధనుష్‌పై సుచిత్ర ఆరోపణలు.. ఫ్యాన్స్ ఫైర్
ABN , Publish Date - May 14 , 2024 | 03:17 PM
కొన్నేళ క్రితం తమిళ సింగర్ సుచిత్ర సుచీ లీక్స్ (suchi leaks) పేరుతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చీకటి బాగోతాలు బయటపెట్టి సంచలనం సృష్టించింది. ధనుష్(Dhanush), రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా, అనిరుద్ లాంటి ప్రముఖుల పార్టీ పోటోలు లీక్ చేసి సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది.
కొన్నేళ క్రితం తమిళ సింగర్ సుచిత్ర సుచీ లీక్స్ (suchi leaks) పేరుతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోని చీకటి బాగోతాలు బయటపెట్టి సంచలనం సృష్టించింది. ధనుష్(Dhanush), రానా దగ్గుబాటి, త్రిష, ఆండ్రియా, అనిరుద్ లాంటి ప్రముఖుల పార్టీ పోటోలు లీక్ చేసి సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. అది పలు వివాదాలకు దారి తీసింది. ఇదంతా జరిగి చాలా కాలం అయింది. తాజాగా మరోసారి ఆమె స్టార్ హీరోలపై సంచలన కామెంట్లు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ధనుష్, ఐశ్వర్యల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతకన్నా ముందు తన మాజీ భర్త, స్టాండప్ కమెడీయన్ కార్తీక్ కుమార్‌పైనా కామెంట్ చేసింది. అతనకొక 'గే’ అని ఇంటర్వ్యూలో తెలిపింది.
గత ఇంటర్వ్యూలో కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ (Casting couch) ఉందని చెప్పిన ఆమె, ధనుష్ (Dhanush) తనను బలవంతంగా కౌగిలిలో బంధించి లైంగిక వేధింపులకు గురిచేశాడని చెప్పింది. ఈసారి ధనుష్. ఐశ్వర్య ఇద్దరిపై కామెంట్స్ చేసింది. ''ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ధనుష్ ఒక గే. అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకొంటారు. వైవాహిక జీవితంలో ఉండి కూడా ఐశ్వర్య మరో వ్యక్తితో డేటింగ్ చేసేది. ఇక ధనుష్‌కి అయితే చాలా ఎఫైర్స్ ఉన్నాయి. అతనొక గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొంది’’ అని తెలిపింది.
అయితే సుచిత్ర మానసిక పరిస్థితి బాగోలేదని, కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతూ మానసిక రుగ్మతలకు గురై ఇలా ప్రవర్తిస్తుందని భర్త కార్తీక్ చెప్పాడు. ధనుష్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలకు అతని అభిమానులు మండిపడుతున్నారు. సుచిత్రపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఐశ్వర్య గురించి మాట్లాడటం తో రజినీకాంత్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.