CELF Awards: ఏకంగా.. ఆరు అవార్డులు సొంతం చేసుకున్న గాయని ఎస్.జె.జనని
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:43 PM
ప్రముఖ సంగీత దర్శకురాలు, సినీ నేపథ్యగాయనిగా గుర్తింపు పొందిన ఎస్.జె.జననికి సీఎల్‌ఈఎఫ్ మ్యూజిక్ అవార్డులు-2024లో పంట పడింది. ఆమె ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకురాలు, సినీ నేపథ్యగాయనిగా గుర్తింపు పొందిన ఎస్.జె.జననికి (S. J. Jananiy) సీఎల్‌ఈఎఫ్ మ్యూజిక్ అవార్డులు-2024లో పంట పడింది. ఆమె ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకున్నారు. తాజాగా ముంబై వేదికగా రేడియో అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో నాలుగో ఎడిషన్ సీఎల్‌ఈఎఫ్ అవార్డుల కార్యక్రమం జరిగింది.
ఇందులో ఆమె సంగీతం సమకూర్చిన ‘రైల్’ చిత్రానికి ఏకంగా నాలుగు విభాగాల్లో అవార్డులు వరించాయి. మరో రెండు అవార్డులను భక్తిపాటల ఆల్బమ్‌కు గెలుచుకున్నారు. ఇందులో జననికి (S. J. Jananiy)ఉత్తమ సంగీత దర్శకురాలు (రైల్), ఉత్తమ నేపథ్య గాయని (రైల్), ఉత్తమ సినీ గేయం (రైల్), బెస్ట్ మ్యూజిక్ అరేంజర్ (రైల్) కేటగిరీల్లో అవార్డులను అందుకున్నారు.
అలాగే, ‘శివనే శివనే ఓం’ అనే డివోషనల్ ఆల్బమ్‌కు బెస్ట్ కంపోజర్, బెస్ట్ ఆల్బమ్ సాంగ్ విభాగాల్లో మరో రెండు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఒకే వేదికపై ఏకంగా ఆరు అవార్డులను గెలుచుకోవడం ఆ దేవుని దయ అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.