యాక్ట‌ర్‌గా మారిన సింగర్‌! 11 యేళ్ళ బాలిక తండ్రి పాత్ర‌తో ప్ర‌శంస‌లు

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:13 PM

మలయాళ నాట‌ సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్‌ గుల్‌ రంజిత్ నటుడిగా మారాడు. ఆపై త‌మిళంలో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.

renjith

మలయాళంలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ సింగర్‌ గుల్‌ రంజిత్ (Gul Renjith Chandran) నటుడిగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మలయాళంలో పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తో పాటు లఘు చిత్రాల్లో నటించిన గుల్ రంజిత్ (Gul Renjith Chandran)ను దర్శకుడు అవతార్ (Avatar) తమిళ చిత్ర పరిశ్రమకు క‌ర్ర (Karaa) అనే సినిమాతో పరిచయం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

GKd4WyeakAAFBHv.jpeg

ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకాదారణ పొందాయి. ప్రధానంగా ఈ సినిమాలో తండ్రి కుమార్తెల మధ్య అనుబంధాన్ని వివరిస్తూ సాగే ‘మగలే.. మగలే.. ’ (Magalae) అనే పాటకు విశేష ఆదరణ వస్తోంది. గతంలో అజిత్‌ నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘విశ్వాసం’లోని ‘కన్నానే కన్నే..’ పాట కంటే ఈ పాట ప్రతి ఒక్కరి గుండెలు పిండేసేలా సాగుతుంది.


a.jpg

అంతేకాకుండా ఈ చిత్రంలో ఆయన 11 యేళ్ళ బాలికకు తండ్రిగా అద్భుతంగా నటించారు. తాను నటించిన తొలి తమిళ చిత్రంలోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే పాత్రలో అద్భుతంగా నటించారంటూ మూవీ యూనిట్‌ నుంచి ప్రశంసలందుకుంటున్నారు.

450574379_372872005817674_4351924269895299525_n.jpg

ఇలా తన తొలి సినిమాతోనే ప్రతి ఒక్కరీ ప్రశంసలందుకుంటున్న గుల్‌ రంజిత్ (Gul Renjith Chandran)కు దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం అందిపుచ్చుకోవడం గమనార్హం. పైగా తన తొలి చిత్రం క‌ర్ర (Karaa) విడుదలైతే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయన్న విశ్వాసాన్ని గుల్ రంజిత్ (Gul Renjith Chandran) వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:29 PM