Shankar: కొన్నేళ్ల తర్వాత కూడా మనిషి ఆలోచనే గొప్పది!

ABN , Publish Date - Jul 02 , 2024 | 02:05 PM

"నా మెదడులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక్కో ఆలోచనను ఒక్కో సినిమాగా తీస్తున్నా. భవిష్యత్తులో ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా చిత్రాలు తీయాలనుకుంటున్నా. అలాగే హిస్టారికల్, సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చేస్తాను’’ అన్నారు అగ్ర దర్శకుడు శంకర్‌

Shankar:  కొన్నేళ్ల తర్వాత కూడా మనిషి ఆలోచనే గొప్పది!


"నా మెదడులో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక్కో ఆలోచనను ఒక్కో సినిమాగా తీస్తున్నా. భవిష్యత్తులో ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా చిత్రాలు తీయాలనుకుంటున్నా. అలాగే హిస్టారికల్, సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు చేస్తాను’’ అన్నారు అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar). భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన. తన సినిమాలతో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. తాజాగా శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'భారతీయుడు 2’ (Indian2. కమల్‌హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో శంకర్‌ అభిమానులతో సరదాగా సంభాషించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

షారుక్‌ఖాన్ (Shah rukh khan)_తో సినిమా చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కచ్చితంగా తీస్తానని చెప్పారు. మంచి స్క్రిప్ట్  ఉంటే ఆయనతో సినిమా తీయడానికి సిద్థంగా ఉన్నానన్నారు శంకర్‌. నా బ్రెయిన్ లో చాలా ఐడియాలున్నాయి. ‘జేమ్స్‌ బాండ్‌’ తరహా చిత్రాలనుంది. హిస్టారికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు కూడా చేస్తాను. నా ఆలోచనలు, నా సినిమాలు బడ్జెట్‌లో ఉంటాయి. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లకు ప్రాధాన్యం ఉండే సినిమాలు. కచ్చితంగా ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తాను. అందరూ ఆశ్చర్యపడే  చిత్రాలు ఉంటాయి అన్నారు.

Senapatin.jpg

నా ఆలోచన సరైనది కాదనిపించింది

శంకర్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌  క్రియేట్‌ చేయకపోవడానికి కారణముంది. గతంలో కూడా దీనికి సమాధానం చెప్పాను. ‘రోబో’ సమయంలో ఆ ఆలోచన వచ్చింది. నా అసిస్టెంట్‌ డైరెక్టర్లకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దాని గురించి వివరించగా వాళ్లు పాజిటివ్‌గా స్పందించలేదు. దీంతో నా ఆలోచన సరైనది కాదనిపించింది. అందుకే సైలెంట్‌ అయ్యాను. వాళ్లు సపోర్ట్‌ చేసుంటే క్రియేట్‌ చేసేవాడిని రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లతో మల్టీస్టారర్‌ ప్లాన్ చేశా. కానీ ఆ సమయంలో కమల్‌హాసన్  బిజీగా ఉండడంతో కుదరలేదు.

టెక్నాలజీకి అనుగుణంగా స్క్రిప్ట్  మార్చుకోను!
నేను సినీ రంగంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలొచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా ఎక్కువైంది. ఎలాంటి సినిమా తీయాలన్నా టెక్నాలజీ అందుబాటులో ఉంది. దాంతో అద్భుతాలు సృష్టించవచ్చు. నా దృష్టిలో ఏఐ  కంటే మనిషి ఆలోచనలు చాలా శక్తిమంతమైనవి. ఇప్పుడే కాదు.. కొన్ని ఏళ్ల తర్వాత కూడా మనుషుల ఆలోచనలే ఏఐ కంటే ముందుంటాయి. నేను నా స్ర్కిప్ట్‌కు తగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటాను. కానీ, టెక్నాలజీకి అనుగుణంగా స్ర్కిప్ట్‌ను మార్చుకోను.

Updated Date - Jul 02 , 2024 | 02:06 PM