Yash: రాకీ.. ‘టాక్సిక్’ మొద‌లైంది

ABN , Publish Date - Aug 08 , 2024 | 05:05 PM

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ గురువారం బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

yash

బాక్సాఫీస్ సెన్సేష‌న్ రాకింగ్ స్టార్ య‌శ్ (Yash) హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ (Toxic: A Fairy Tale for Grown-Ups) గురువారం బెంగ‌ళూరులో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కేజీఎఫ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత య‌ష్ న‌టిస్తోన్న కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంద‌రి ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ (Geetu Mohandas) తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మూవీ కోసం స్టార్ యాక్ట‌ర్స్‌, టెక్నిక‌ల్ టీమ్ చేతులు క‌లిపింది.

WhatsApp Image 2024-08-08 at 4.47.04 PM.jpeg

తాజాగా.. గురువారం జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్ (Yash) , నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని కొరుతూ దేవుడి ఎదుట పూజ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందన‌లు తెలిపారు.


WhatsApp Image 2024-08-08 at 4.47.03 PM.jpeg

కేజీయ‌ఫ్ త‌ర్వాత య‌శ్ (Yash) ఎలాంటి సినిమా చేస్తారోన‌ని ఆస‌క్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్ష‌ణ‌కు ఈరోజుతో తెర ప‌డింది. అలాగే సినిమా ప్రారంభ‌మైన రోజుని న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చూసిన 8-8-8ను సూచిస్తుంది. ఇది య‌శ్ పుట్టిన‌రోజును తెలియ‌జేస్తుంది.

WhatsApp Image 2024-08-08 at 4.47.01 PM.jpeg

Updated Date - Aug 08 , 2024 | 05:05 PM