Kantara: Chapter 1: భారీ స్థాయిలో కాంతార చాప్టర్‌-1

ABN , Publish Date - Jun 12 , 2024 | 10:09 AM

'కాంతార’ (Kantara) చిత్రం చిన్న సినిమాగా విడుదలై పాన్  ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. సినిమా విడుదలైన చాలాకాలం వరకూ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

Kantara: Chapter 1: భారీ స్థాయిలో కాంతార చాప్టర్‌-1

'కాంతార’ (Kantara) చిత్రం చిన్న సినిమాగా విడుదలై పాన్  ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. సినిమా విడుదలైన చాలాకాలం వరకూ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఆ సక్సెస్‌ ఉత్సాహంతో నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి (rishab shetty) ‘కాంతార: చాప్టర్‌ 1’ (Kantara chapter 1)పేరుతో మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే! ఆయనే హీరోగా నటిస్తూ స్వయంగా ఇప్పుడు ప్రీక్వెల్‌ సిద్థం చేస్తున్నారు. ఇటీవల సెట్స్‌పైకి వెళ్లింది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

భారీ గ్రాఫిక్స్‌ హంగులతో ఈ చిత్రం ముస్తాబు  కానుందని దర్శకుడు ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు యూఎస్‌, యూకేల్లో జరుగుతున్నట్లు శాండల్‌వుడ్‌  మీడియా చెబుతోంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం రిషబ్‌ ఇప్పటికే కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు.  వచ్చే ఏడాది దక్షిణాది భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 10:09 AM