Kantara chapter 1: రిషబ్‌శెట్టి ఏం చెప్పారంటే!

ABN , Publish Date - Jul 13 , 2024 | 09:42 AM

చిన్న సినిమాగా మొదలై  పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం. ‘కాంతార’. రిషబ్‌శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్థమవుతోంది.

చిన్న సినిమాగా మొదలై  పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం. ‘కాంతార’. రిషబ్‌శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ సిద్థమవుతోంది.  హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గురించి రిషబ్‌ తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘కాంతార 1’ కథ పరంగానే కాక నేను పోషిస్తున్న పాత్ర పరంగానూ చాలా పెద్దది. నా కెరీర్‌లో ఇంత భారీ స్థాయి చిత్రం నేనింత వరకు చేయలేదు. ఇదే నన్ను మరింత బాధ్యతతో పని చేసేలా  ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమా కథా రచన.. స్క్రీన్ ప్లే  దేనికదే ఎంతో సవాల్‌గా అనిపించాయి. మొత్తం ఈ సినిమాని పూర్తి చేయడానికి దాదాపు ఆరు నుంచి ఏడు షెడ్యూల్స్‌ అవసరమవుతాయని భావిస్తున్నాను. కచ్చితంగా ప్రేక్షకులకు తొలి భాగాన్ని మించేలా గొప్ప అనుభూతిని అందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను’’ అని అన్నారు.

WhatsApp Image 2024-07-13 at 9.36.39 AM.jpeg

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం రిషబ్‌తో పాటు మిగీలిన ప్రధాన తారాగణం కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. అరవింద్‌ కశ్యప్‌ ఛాయగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Mahesh Babu Look: అనంత్‌ అంబానీ పెళ్లిలో.. సోషల్ మీడియా తగలెడిపోతోంది

Updated Date - Jul 13 , 2024 | 09:43 AM