Rajinikanth: రెండు సినిమాల అప్‌డేట్‌ ఇచ్చారు!

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:08 AM

నేటితరం హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు తలైవా రజనీకాంత్. తాజాగా ఆయన రాబోవు చిత్రాల గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. కేరళలోని ఓ పెళ్లికి హాజరైన రజనీ తిరిగి చెన్నై వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు.

నేటితరం హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తున్నారు తలైవా రజనీకాంత్(Rajinikanth). తాజాగా ఆయన రాబోవు చిత్రాల గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. కేరళలోని ఓ పెళ్లికి హాజరైన రజనీ తిరిగి చెన్నై వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. కమల్‌హాసన్‌ తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’ (Indian2)నచ్చిందని ఆయన చెప్పారు. ‘వేట్టయాన్‌’ (Vettaiyan) వాయిదా వార్తలపై స్పందిస్తూ.. ‘‘ఈ చిత్రానికి  ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయి. అలాగే ‘కూలీ’ (Coolie) సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది’ అని అన్నారు. ఈ సినిమా విషయానికొస్తే టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా కీలక పాత్రల్లో కనిపిస్తారు. ‘కూలీ’ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రానుంది. బంగారం స్మగ్లీంగ్‌ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌ ముఖ్య పాత్రధారులు. ఈ రెండు సినిమాల తర్వాత ‘జైలర్‌ 2’ కూడా పట్టాలెక్కనుంది. 

అయితే ఇటీవల ఓ వేదికపై రజనీ ‘వేట్టయాన్‌’ గురించి మాట్లాడుతూ.. తన భాగం షూటింగ్‌ పూర్తయిందన్నారు. దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని వెల్లడించారు. సూర్య నటిస్తున్న ‘కంగువా’ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ వాయిదా పడుతుంది కాబట్టే ‘కంగువా’ను దసరాకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మరి ‘వేట్టయాన్‌’ విడుదల ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jul 22 , 2024 | 12:28 PM