Rajini vs Nani: రజనీకాంత్‌తో నాని పోటా పోటీ
ABN , Publish Date - Jul 18 , 2024 | 02:45 PM
సైమా మూవీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సెప్టెంబరు 14, 15వ తేదీల్లో దుబాయ్ వేదికగా జరుగనుంది. ఈ క్రమంలో ఈ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్ల జాబితా తాజాగా వెల్లడైంది.
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (ఎస్‌ఐఐఎంఏ-సైమా) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సెప్టెంబరు 14, 15వ తేదీల్లో దుబాయ్ వేదికగా జరుగనుంది. ఇప్పటికే ఈ అవార్డుల కోసం పోటీ పగుతున్న చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్ల జాబితా తాజాగా వెల్లడైంది.
అయితే ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ ఏకంగా 12 విభాగాల్లో, తెలుగులో నాని (Nani) నటించిన దసరా (Dasara) 11 విభాగాల్లో, హయ్ నాన్న (Hi Nanna) 10 విభాగాల్లో, మలయాళంలో టోవినో థామస్ నటించిన 2018, కన్నడలో దర్శణ్ నటించిన కాటేరా ( Kaatera) 8 విభాగాల్లో సైమా అవార్డుల కోసం పోటీ పడుతుండడం విశేషం.
తెలుగులో ఉత్తమ చిత్రం జాబితాలో దసరా, బలగం, బేబీ, భగవంత్ సింగ్ కేసరి, హాయ్ నాన్న , విరూపాక్ష చిత్రాలు ఉండగా. ఉత్తమ నటులు జాబితాలో చిరంజీవి, బాలకృష్ణ, నాని, ధనుష్, సాయి ధరమ్ తేజ్ పోటీ పడుతున్నారు. ఉత్తమ కథానాయికల జాబితాలో శ్రీలీల, సంయుక్త, పాయల్ రాజ్ పుత్, కీర్తి సురేశ్, శృతి హసన్, మృణాల్ ఠాకూర్ ఉన్నారు. ఉత్తమ దర్శకులుగా అనీల్ రావిపూడి, గోపీచంద్, సాయి రాజేశ్, బాబీ, కార్తీక్ దండు ఉన్నారు. ఉత్తమ సోర్టింగ్ యాక్టర్స్‌గా బ్రహ్మనందం, రవికృష్ణ, అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్, ఫృధ్వీరాజ్ సుకుమారన్, దీక్షిత్ శెట్టి ఉన్నారు.
తమిళంలో ఉత్తమ చిత్రం జాబితాలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి, వడివేలు నటించిన ‘మామన్నన్’, లోకేశ్ కనగరాజ్ లియో, మణిరత్నం పొన్నియిన్ సెల్వన్-2, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదలై వంటి చిత్రాలున్నాయి.
అదేవిధంగా తమిళంలో ఉత్తమ నటుల విభాగంలో రజనీకాంత్, విజయ్, విక్రమ్, శివకార్తికేయన్ (మావీరన్), ఉదయనిధి ఉన్నారు. ఉత్తమ నటి విభాగంలో త్రిష, నయనతార, ఐశ్వర్యా రాయ్, కీర్తి సురేష్, మీతా రఘునాథ్. ఐశ్వర్య రాజేష్ ఉన్నారు. ఉత్తమ దర్శకుల కేటగిరీలో నెల్సన్, లోకేష్ కనకరాజ్, మణిరత్నం, వెట్రిమారన్, అరుణ్ కుమార్, మారి సెల్వరాజ్ ఉన్నారు.