Raayan: ఓటీటీలో స్ట్రీమింగ్ ఎపుడు అంటే.. 

ABN , Publish Date - Aug 16 , 2024 | 05:20 PM

ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


ధనుష్‌ (Shanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాయన్‌’. (Raayan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్   డేట్‌ ఫిక్స్‌ అయింది.  ఈ నెల 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసింది.

కథ: 

ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్‌ (ధనుష్‌)కు ఇద్దరు తమ్ముళ్లు (సందీప్‌కిషన్‌, కాళిదాస్‌ జయరామ్‌), ఒక చెల్లి (దుషారా విజయన్‌). చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమవుతారు. టౌన్‌కి వెళ్లొస్తామని చెప్పి మళ్లీ తిరిగిరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు రాయన్‌ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడం అప్పట్నుంచే అలవాటవుతుంది. తన తోబుట్టువులకు అన్నీ తానే అయ్యి చూసుకుంటాడు. ముగ్గురుని వెంటబెట్టుకుని నగరానికి వెళ్లి ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురు పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై (శరవణన్‌), సేతు  (ఎస్‌.జె.సూర్య) గ్యాంగ్స్‌ మధ్య ఎప్పట్నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్‌ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్లు, చెల్లెల కోసం రాయన్‌ ఏం చేశాడు? రాయన్‌ కోసం వాళ్లు ఏం చేశారు? తదితర విషయాలన్నీ సినిమా చూడాల్సిందే!

Updated Date - Aug 16 , 2024 | 05:42 PM