R. Parthiban: తమన్నాపై కీలక వ్యాఖ్యలు.. తగ్గిన దర్శకుడు!

ABN , Publish Date - Jul 19 , 2024 | 04:32 PM

తమన్నా (Tamannaah) డ్యాన్స్‌ గురించి కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు పార్తిబన్‌ (R Parthiban)చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

తమన్నా (Tamannaah) డ్యాన్స్‌ గురించి కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు పార్తిబన్‌ (R Parthiban)చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! తమన్నా డ్యాన్స్‌ ఉంటే చాలు.. సినిమాలో కథ లేకపోయినా ఫర్వాలేదు అన్నట్లు ఇప్పుడు పరిస్థితులు మారాయని తాజా ఇంటర్వ్యూలో ఆయన కామెంట్‌ చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా కాగా పార్తిబన్  వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. ఆయన ఏ చిత్రాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని చర్చి మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్తిబన్‌ క్షమాపణలు చెప్పారు. చిత్ర పరిశ్రమకు చెందిన వారందరిపైనా తనకు గౌరవం ఉందని చెప్పారు. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు, తన మాటలు ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలని పార్తిబన్ కోరారు. (Comments on Tamannaah)

కోలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో పార్తిబన్‌ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘రచ్చ’ సినిమాలో సందడి చేశారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘టిన్జ్‌’. అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తమన్నా గురించి వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులు సినిమాలో కథ ఉందా? లేదా అనేది చూడటం లేదు. హీరోయిన్‌ డ్యాన్స్‌ కోసమే చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్‌ అవుతుంది’’ అన్నారు. ఆయన ‘జైలర్‌’, ‘బాక్‌’ చిత్రాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. 

Updated Date - Jul 19 , 2024 | 04:32 PM