Petta Rap: సెప్టెంబరులో థియేట‌ర్ల‌లోకి.. ప్రభుదేవా ‘పేట్ట రాప్‌’

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:06 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, సినీ దర్శకుడు, హీరో ప్రభుదేవా, వేదిక, సన్నీ లియోనీ నటించిన ‘పేట్ట రాప్‌’. ప్రస్తుతం అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

pettarap

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, సినీ దర్శకుడు, హీరో ప్రభుదేవా (PrabhuDeva), వేదిక (Vedhika), సన్నీ లియోన్ (SunnyLeone) నటించిన ‘పేట్ట రాప్‌’ (PettaRap) తమిళనాడు థియేట్రికల్‌ రిలీజ్‌ రైట్స్‌ ను ప్రముఖ కంపెనీ సఫైర్‌ స్టూడియో సొంతం చేసుకుంది. ఎస్‌.జె.సిను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బ్లూ హిల్‌ ఫిలింస్‌ పతాకంపై జోబి బి సామ్‌ నిర్మించారు. ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో రియాజ్‌ ఖాన్‌, రమేష్‌ తిలక్‌, భగవతి పెరుమాళ్‌, వివేక్‌ ప్రసన్న, కళాభవన్‌ షాజోన్‌ వంటి తారాగణం నటించారు.


GVvsO7wWQAABIee.jpeg

పీకే దినీల్‌ కథను సమకూర్చగా, జిత్తు దామోదర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి సంబంఽధించి మోషన్‌ పోస్టర్‌తో పాటు రెండు పాటలు, టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ (D Imman) సంగీతం అందించారు.

Updated Date - Aug 27 , 2024 | 12:40 PM