Prabhu Deva: ప్రభుదేవా హీరోగా మ‌రో చిత్రం.. ‘సింగానల్లూరు సిగ్నల్‌’

ABN , Publish Date - Jul 03 , 2024 | 08:54 AM

ప్రభుదేవా మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. తాజాగా ఆయ‌న హీరోగా నటిస్తున్న‘సింగానల్లూరు సిగ్నల్‌’ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.

prabhudeva

ప్రభుదేవా (Prabhudheva) హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సింగానల్లూరు సిగ్నల్‌’ (Singanallur Signal) అనే పేరు పెట్టారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం చెన్నైలో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది.

GRYONeAWkAACH2g.jpeg

ప్రభుదేవా (Prabhudheva) హీరోగా గ‌త సంవ‌త్స‌రం వ‌చ్చిన‌ ‘బగీరా’ సినిమా నెగెటివ్‌ రివ్యూల కారణంగా పరాజయం పొందింది. ప్ర‌స్తుతం ‘పేట రాప్‌’, ‘ది గోట్‌’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఆయ‌న‌ తాజాగా ‘సింగానల్లూరు సిగ్నల్‌’ (Singanallur Signal)అనే మ‌రో చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.


GRfQ_2maYAAlESg.jpeg

జేఎం రాజా దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మలయాళ నటుడు సైన్‌ టామ్‌ చాకో (shine tom chacko) ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీమాన్‌, భవ్యత్రిక, అయాజ్‌ ఖాన్‌, నిఖిల్‌ థామస్‌ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ఏనుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Updated Date - Jul 03 , 2024 | 08:54 AM