The Goat Life: ఎడారిలో రూపొందిన తొలి భారతీయ సినిమా ది గోట్ లైఫ్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రభాస్
ABN , Publish Date - Jan 10 , 2024 | 06:37 PM
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటిస్తున్న కొత్త సినిమా "ది గోట్ లైఫ్" (The Goat Life) (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు.
విజువల్ రొమాన్స్ బ్యానర్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కు, "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) మూవీ టీమ్ కు ప్రభాస్ తన బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) మాట్లాడుతూ నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) (The Goat Life) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. ఐదేళ్లు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్ లోనూ ప్రేక్షకులు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతారు. అని చెప్పారు.
90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) (The Goat Life)లో చూపించబోతున్నారు. ఇది పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.