Diesel Movie: దీపావళి రేసులోకి.. పార్కింగ్‌ హరీష్‌ కల్యాణ్‌ ‘డీజల్‌’

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:01 AM

గ‌త సంవ‌త్స‌రం పార్కింగ్ వంటి క్లాసిక్ హిట్‌తో కుటుంబ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్‌ కల్యాణ్ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజల్‌’. ఈ సినిమాను దీపావళికి విడుదల చేసేలా మేక‌ర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

diesel

గ‌త సంవ‌త్స‌రం పార్కింగ్ వంటి క్లాసిక్ హిట్‌తో కుటుంబ ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్‌ కల్యాణ్ (Harishkalyan) హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజల్‌’ (Diesel) పాన్ ఇండియాగా రిలీజ్‌కు రెడీ అయింది. షణ్ముగ ముత్తుస్వామి (Shanmugam Muthusamy) దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో అతుల్య రవి (Athulyaa Ravi) హీరోయిన్‌గా న‌టించిగా కరుణాస్‌, సాయికుమార్‌, అనన్య, వినయ్‌ రాయ్ (Vinay Rai), తంగదురై, రమేష్‌ తిలక్‌, దీనా, వివేక్‌ ప్రసన్న వంటి వారు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

GRNwjDUW0AA9fqi.jpeg

అయితే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని చివరి దశ నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ ‘డీజల్‌’ (Diesel) సినిమాను దీపావళి (Diwali)కి విడుదల చేసేలా మేక‌ర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. హరీష్‌ కల్యాణ్‌ (Harishkalyan) సినీ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మితమైన చిత్రం కావడంతో సరైన రిలీజ్‌ తేదీ కోసం చిత్ర దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.


Fmf0v76aYAAxb_j.jpeg

ఇందులో భాగంగా, దీపావళి పండుగ రోజైన అక్టోబరు 31న ‘డీజల్‌’ (Diesel) సినిమాను రిలీజ్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఇదే రోజున శివకార్తికేయన్‌ ‘అమరన్‌’, జయం రవి ‘బ్రదర్‌’ చిత్రాలు విడుదలకు చేయనున్నట్టు ప్రకటించారు. డిబు నినన్‌ థామస్‌ సంగీతం అందించే ఈ మూవీని థర్డ్‌ ఐ ప్రొడక్షన్స్ ( Third Eye Entertainment), ఎస్‌.పిప్రొడక్షన్స్ (SP CINEMAS (PRODCO PVT LTD)సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - Aug 27 , 2024 | 07:01 AM