Pa. Ranjith: కులంతో హోదా.. అందుకే ఎవరు వదులుకోరు

ABN , Publish Date - Aug 18 , 2024 | 12:58 PM

ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి అంబేడ్కర్‌ దృష్టి కోణం చాలా అవసరమని చెప్పారు దర్శకుడు పా రంజిత్. 

"నేను ఎప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శను కోరుకుంటాను. దాని నుంచి ఎన్నో నేర్చుకుంటాను. విమర్శ నన్ను తీర్చిదిద్దుతుంది. అయితే బాధ్యత లేకుండా చేసే విమర్శలను నేను పట్టించుకోను. ఎవరైనా నన్ను అన్నప్పుడు బాధపడతాను" అని అంటున్నారు దర్శకుడు పా రంజిత్. తాజాగా అయన దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'తంగలాన్' చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకొచ్చి సక్సెసఫుల్ గా నడుస్తోంది. ఈ సందర్భంగా అయన నవ్య తో మాట్లాడారు. 

  • "నా ఆలోచనలను ఎటువంటి ఫిల్టర్స్‌ లేకుండా చెప్పగలటమే స్వేచ్ఛ అంటే! అయితే అది చాలా కష్టమైన విషయం. అన్నిసార్లు నేను అనుకున్నది చెప్పలేను" అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి అంబేడ్కర్‌ దృష్టి కోణం చాలా అవసరమని చెప్పారు. 


  • "అంబేడ్కర్‌ ఒక ఆధునిక భారత దేశాన్ని నిర్మించాలని అనుకున్నాడు. కుల వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలించాలనుకున్నాడు.  వ్యవస్థను సంపూర్తిగా మార్చాలనుకున్నాడు. ఆయన నిర్మించాలనుకున్న ఆధునిక భారతంలో ఎటువంటి అసమానతలు ఉండవు. ‘క్యాస్ట్‌ ఇన్‌ ఇండియా’ లాంటి పుస్తకాలు చదివితే మనకు ఆయన దృష్టి కోణం అర్థమవుతుంది. ‘‘మేము ఆధునికులం’’ అని చెప్పుకొనేవారిలో ఎక్కువమంది ఆయన పుస్తకాలను చదవరు. చాలామంది ఆయన దళితుల కోసం మాత్రమే అనుకుంటారు. అది చాలా తప్పు. ఆయన ఆధునిక భారత దేశ ప్రజలందరివాడు. 

  • PA-ranjith.jpg
    హైరార్కీని తొలగించాలనుకుంటాను. మానవ వ్యవస్థ నన్ను నిలవనివ్వదు. దీని నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటాను. ఎటువంటి హైరార్కీని నేను సహించలేను. కొన్నిసార్లు మనకు తెలియకుండానే హైరార్కీలో నివసిస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో నన్ను నేను సరిచేసుకుంటూ ఉంటా. ఇది జీవితాంతం నిరంతరంగా జరిగే ప్రక్రియ. దీన్ని ప్రాక్టీస్‌ చేయటం చాలా కష్టం.


  • కులం ఆధునికతను అల్లుకుపోతోంది. కులం అనేది మనకు పల్లెటూర్లలో కనిపిస్తుంది. పట్టణాలలో పైకి కనిపించదు. మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తిలోను ఈ కుల భావన ఉంటుంది. చాలా మందికి కులం ఒక సంపద లాంటిది. ఇది హోదా ఇస్తుంది. అందువల్లే దాన్ని వదలుకోవటానికి ఎవరు ఇష్టపడరు. నా ఉద్దేశంలో అంబేడ్కర్‌ సిద్ధాంతాలను అనుసరిస్తే- దీన్ని సమూలంగా నిర్మూలించగలం.

Updated Date - Aug 18 , 2024 | 12:59 PM