Kamal Haasan: ‘కొట్టుకాలి’.. చూసి ఆశ్చర్యపోయా

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:45 PM

‘విడుదలై’, ‘గరుడన్‌’ చిత్రాల తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘కొట్టుకాలి’. తాజాగా ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్‌ హాసన్ తిలకించి, ఆ చిత్ర బృందాన్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.

kottukaali

‘విడుదలై’, ‘గరుడన్‌’ చిత్రాల తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘కొట్టుకాలి’ (Kottukkaali). అన్నాబెన్ క‌థానాయుక‌గా న‌టించింది. కోడిపుంజు ఓ ప్ర‌ధాన పాత్ర పోషించింది. వాస్తవ జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ మూవీని ప్రముఖ హీరో శివకార్తికేయన్‌ ఎస్‌కె ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. పీఎస్‌ వినోద్‌ దర్శకత్వం వహించ‌గా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) తిలకించి, ఆ చిత్ర బృందాన్ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ బృందాన్ని అభినందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

annaben

‘బిగ్ స్క్రీన్‌పై కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్‌ (సెన్సార్‌ సర్టిఫికేట్‌) నుంచి చివరి క్షణం వరకు చాలా సంద‌ర్భాల్లో ఆశ్చర్యపోయాను. ఇందులో నటించిన వారిలో సూరి మినహా ఇతర నటీనటులు నాకు తెలియదు. సినిమా ప్రారంభమైన మూడు నిమిషాల తర్వాత సూరి కూడా కనిపించడు. కేవలం పాండియన్‌ మాత్రమే కనిపిస్తాడు. పాండి పాత్రను ప్రపంచాన్ని తలకిందులుగా చూపిస్తూ పరిచయం చేసిన తీరు బాగుంది. హీరోయిన్‌ కళ్ళలో భూమాత సహనం కనిపిస్తుంది.


soori

టైటిల్‌ కార్డుల్లో వచ్చే సహజసిద్ధ ధ్వనులను ఉప‌యోగించుకున్న విధానం బావుంది.. ప్ర‌త్యేకంగా సంగీత ద‌ర్శకుడు లేకుండానే ప్రకృతిలో నిత్యం మ‌న‌కు వినిపించే శ‌బ్దాల‌ను వాడ‌డం విభిన్నంగా ఉంది. ఇలా అనేక ఆశ్చర్యకర అంశాలతో సినిమా ఓ ప‌ల్లె క‌థ‌ను హృద్యంగా తెర‌కెక్కించారు అందుకు ప్ర‌కృతికి, నిర్మాత శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు’ అంటూ కమల్‌ హాసన్ (Kamal Haasan) అభినందించారు.

Updated Date - Aug 23 , 2024 | 02:46 PM