Nayanathara: తొమ్మిదేళ్ల ప్రయాణం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న నయన్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:29 PM

ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి వివాహబంధం వరకూ తీసుకెళ్లింది.  ఈ సినిమా విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు.


సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో చూడ ముచ్చటైన అందమైన జోడీల్లో నయనతార(Nayanathara)-విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Sivan) ల జంట ఒకటి. ‘నేను రౌడీనే’ (nenu rowdine) చిత్రంతో వీరిద్దరూ ఒకటయ్యారు. విఘ్నేశ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార కథానాయిక. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి వివాహబంధం వరకూ తీసుకెళ్లింది.  ఈ సినిమా విడుదలైన ఏడేళ్ల తర్వాత 2021లో వీళ్ల ప్రేమను మీడియా ముందు చెప్పారు. 2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు. ‘నేను రౌడీనే’ విడుదలై 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా నయనతార స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు. విఘ్నేశ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఈ చిత్రం తన జీవితాన్ని మార్చేసిందన్నారు. (Nenu Rowdy Ne)

Vikki.jpg

‘‘నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన చిత్రం. నా కెరీర్‌ను గొప్పగా మలచిన సినిమా ‘నేను రౌడీనే’. 9 ఏళ్ల కిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకొని మర్చిపోలేని అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్‌కు కృతజ్ఞతలు. దీని నుంచి నటిగా కొత్త అనుభవాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేశ్‌ను ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు.

Nayan.jpg

ఈ సినిమా గురించి విఘ్నేశ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను రౌడీనే’ సినిమాలో హీరోయిన్‌గా నయనతార అయితే బాగుంటుందని ధనుష్‌ చెప్పారు. దీంతో ఆమెకు కథ వినిపించగా వెంటనే ఓకే చేసింది. చిత్రీకరణకు సంవత్సరం పట్టింది. ఆ ఏడాదంతా ఆమెతో ఉండే అవకాశం వచ్చింది. తన ఇష్టాయిష్టాలను తెలుసుకునే సమయం దొరికింది’ అని అన్నారు.

 

Updated Date - Oct 22 , 2024 | 03:33 PM