హీరోయిన్గా.. బిగ్‌బాస్ జనని! కొత్త చిత్రం ప్రారంభం
ABN , Publish Date - Aug 27 , 2024 | 06:21 AM
‘అసురన్’, ‘పత్తు తల’ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన టీజయ్ అరుణాచలం హీరోగా ‘బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫేం’, ‘లియో’ సినిమాలో విజయ్ చెల్లెలిగా నటించిన జనని హీరోయిన్గా కొత్త చిత్రం ప్రారంభమైంది.
‘అసురన్’ (ధనుష్), ‘పత్తు తల’ (శింబు) వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా నటించిన టీజయ్ అరుణాచలం (Teejay Arunasalam) హీరోగా పరిచయమవుతున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు, పరిసర ప్రాంతాల్లో ఈనెల 15 నుంచి శరవేగంగా జరుపుకుంటోంది.
ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శింబు దేవన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన నవీన్ డి. గోపాల్ దర్శకత్వం చేపట్టారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘బిగ్‌బాస్ ఆరో సీజన్ ఫేం’, ‘లియో’ సినిమాలో విజయ్ చెల్లెలిగా (క్యాంటీన్లో పనిచేసే) అమ్మాయిగా నటించిన జనని (Janany Kunaseelan) హీరోయిన్గా నటిస్తోంది.
వీరితో పాటు సీనియర్ నటి రాశితో పాటు ఆదిత్య, కల్కి రాజా, సూపర్‌గుడ్ సుబ్రమణి, సెంథిల్‌కుమారి, దీపా శంకర్, క్రేన్ మనోహర్, పావెల్ నవగీతన్ వంటి వారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. మాసం సతీష్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమాకు ఆర్ట్ సౌందర్, సంగీతం కిరణ్ జోస్. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆర్.వెంకటేష్. నిర్మాత మౌళి ఎం.రాధాకృష్ణన్.