Nassar: మా జీవితాల్లో అతనిది ప్రత్యేక పాత్ర
ABN , Publish Date - Dec 31 , 2024 | 02:20 PM
నాజర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడికి గతంలో జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకున్నారు. యాక్సిడెంట్ వల్ల తన కుమారుడు 14 రోజులు కోమాలో ఉన్నట్లు చెప్పారు.
నాజర్ (Nassar) గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణమైన పాత్రలతో మెప్పించారాయన. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుమారుడికి గతంలో జరిగిన యాక్సిడెంట్ రోజులను గుర్తుచేసుకున్నారు. యాక్సిడెంట్ వల్ల తన కుమారుడు 14 రోజులు కోమాలో ఉన్నట్లు చెప్పారు. స్పృహలోకి వచ్చాక తల్లిదండ్రుల పేర్లు కాకుండా విజయ్ (Vijay) పేరు చెప్పినట్లు వివరించారు.
‘‘
నా కుమారుడికి (Nassar Son) 2014లో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఎంతో బాధాకరం. అయితే అతడు ఆ ప్రమాదం నుంచి ధైౖర్యంగా బయటకు వచ్చాడు. అతడు విజయ్‌కు వీరాభిమాని. తరచూ దళపతిని అనుకరిస్తూ ఉంటాడు. అలా చేయడమే యాక్సిడెంట్ సమయంలో అతడి జ్ఞాపకశక్తిని నిలిపింది. కోమాలో నుంచి స్పృహలోకి రాగానే మా పేర్లు చెబుతాడేమో అనుకున్నాం. కానీ, విజయ్ పేరు చెప్పాడు. వైద్యులు విజయ్ సినిమాలను, పాటలను చూపారు. అతడిలో వచ్చే మార్పులు గమనించాం. ఈ విషయం తెలుసుకున్న విజయ్ మా అబ్బాయిని కలిశారు. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. మా అబ్బాయికి ఇష్టమైన సంగీత వాయిద్యాన్ని విజయ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే విజయ్ ఎప్పటికీ నాకు ప్రత్యేకం. ఆయన మా జీవితాల్లో ప్రత్యేక పాత్ర పోషించారు.
విజయ్ ప్రస్తుతం రాజకీయపార్టీ పెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన వెంకట ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’లో చిత్రంలో నటించారు. ఈ ఏడాది విడుదలైన హిట్ చిత్రాల జాబితాలో ఇదొకటి. ప్రస్తుతం ఆయన హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘దళపతి 69 ’ చేస్తున్నారు. దీని తర్వాత రాజకీయాల్లో మరింత బిజీ కానుండడంతో ఇదే చివరి చిత్రం అని ప్రచారం జరుగుతోంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రానుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.