Nadigar Sangam: నడిగర్‌ సంఘం ‘స్టార్‌ నైట్‌’.. రజనీకాంత్‌తో స‌మావేశం

ABN , Publish Date - Jul 03 , 2024 | 11:27 AM

నడిగర్‌ సంఘం భవన నిర్మాణం కోసం నిధుల నిమిత్తం ఒక స్టార్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు హీరో రజనీకాంత్ ను కలుసుకున్నారు.

nadigar sangam

నడిగర్‌ సంఘం (Nadigar Sangam) భవన నిర్మాణం కోసం నిధుల సేకరణ నిమిత్తం ఒక స్టార్‌ నైట్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం నడిగర్‌ సంఘం నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ స్టార్‌ నైట్‌ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? అనే విషయంపై అగ్ర నటులు కమల్‌ హాసన్ (Kamal Haasan), రజనీకాంత్ (Rajinikanth) నుంచి నడిగర్‌ సంఘ సభ్యులు సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు.


nadigar.webp

ఈ క్ర‌మంలో ఆ సంఘం కోశాధికారి కార్తీ (Karthi), ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్ (Poochy Murugan), కరుణాస్ (Karunas) హీరో రజనీకాంత్ (Rajinikanth)ను పోయస్‌ గార్డెన్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టార్‌ నైట్‌ నిర్వహణపై సూచనలు, సలహాలను రజనీకాంత్‌ను కోరారు. ఈ సందర్భంగా నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయని సంఘం సభ్యులను అడిగి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 01:57 PM