Yuvan Shankar Raja: యువన్‌ శంకర్ రాజా నిర్మాతగా ‘స్వీట్‌హార్ట్‌’

ABN , Publish Date - Aug 05 , 2024 | 01:06 PM

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా నిర్మాతగా ‘స్వీట్‌హార్ట్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది.తాజాగా ఈ సినిమా టైటిల్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

yuvan

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) నిర్మాతగా ‘స్వీట్‌హార్ట్‌’ (Sweet Heart )పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ‘నెంజముండు నేర్మైయుండు’, ‘జో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించిన రియోరాజ్ (Rio raj) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్వినీత్‌ ఎస్‌.సుకుమార్ (Swineeth Sukumar) ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టైటిల్‌ ప్రోమో వీడియోను చిత్ర బృందం తాజాగా రిలీజ్‌ చేసింది.


yuvan_rio_sweetheart_290724_3.jpg

ఇందులో గోపిక రమేష్ ( GopikaRamesh), రెడిన్‌ కింగ్‌స్లీ, రెంజీ పాణికర్‌, అరుణాచలేశ్వరన్‌, తులసి తదితరులు నటించారు. సమకాలీన ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రియోరాజ్ (Rio raj) హీరోగా నటించిన ‘జో’ సినిమా ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇపుడు ‘స్వీట్‌హార్ట్‌’(Sweet Heart )ను కూడా అలాంటి కథాంశంతోనూ రూపొందించడం గమనార్హం. కాగా, ఈ కొత్త సినిమా ప్రోమోను చూసిన అభిమానులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 01:06 PM