Mohan Lal: దయచేసి అమ్మను లక్ష్యంగా చేయవద్దు!
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:55 PM
జస్టిస్ హేమ కమిటీ నివేదిక (Hema Committee report)మలయాళ చిత్ర పరిశ్రమలో కకావికలం చేస్తోంది. దీంతో అన్ని పరిశ్రమల నుంచి ఇబ్బందులకు గురవుతున్న మహిళలు దైర్యంగా గొంతెత్తుతున్నారు
జస్టిస్ హేమ కమిటీ నివేదిక (Hema Committee report)మలయాళ చిత్ర పరిశ్రమలో కకావికలం చేస్తోంది. దీంతో అన్ని పరిశ్రమల నుంచి ఇబ్బందులకు గురవుతున్న మహిళలు దైర్యంగా గొంతెత్తుతున్నారు. ఈ వ్యవహారంలో కేవలం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ను (AMMA) లక్ష్యంగా చేసుకోవద్దని ‘అమ్మ’ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ (mohan lal) విజ్ఞప్తి చేశారు. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నామని, ఆ నివేదికను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైనదేనన్నారు. అన్ని ప్రశ్నలకు ‘అమ్మ’ సమాధానం చెప్పడం సాధ్యం కాదన్నారు. మలయాళ చిత్రపరిశ్రమ.. చాలా కష్టపడి పనిచేేస పరిశ్రమ అని చెప్పారు. ఇందులో చాలామంది ఉన్నారని, అందరినీ నిందించలేమని తెలిపారు.
ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో దయచేసి పరిశ్రమను నాశనం చేయకండని విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్ల్లువెత్తిన నేపథ్యంలో ఇటీవలే ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశారు.