Darshan: జైల్లో 100 రోజులు..  వైద్య పరీక్షల అనంతరం.. 

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:02 PM

రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌ కోరుతూ దర్శన్‌ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌ శెట్టి విచారించారు.




రేణుకాస్వామి (Renuka Swami Case) హత్య కేసులో రెండవ నిందితుడు, కన్నడ నటుడు దర్శన్‌ (Darshan)ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్‌ కోరుతూ దర్శన్‌ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ విశ్వజిత్‌ శెట్టి విచారించారు. పిటిషన్‌ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్‌ సూచించారు. బళ్లారి జైలులో దర్శన్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్‌ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్‌ ఇవ్వాలని దర్శన్‌ తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసు విచారణలో లోపాలున్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు.

దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించి కేసును వాయిదా వేశారు. దర్శన్‌, పవిత్రగౌడ జూన్‌ 10 నుంచి అరెస్ట్‌ అయ్యి జైలులో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల? సిట్‌ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్‌ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిల్‌ కోసం ప్రముఖ లాయర్లతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్‌ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్‌జైల్‌లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు.  బెయిల్‌ను మరోసారి వాయిదావేశారు.  (medical Test for Darshan)

Updated Date - Oct 24 , 2024 | 05:02 PM