Mamitha Baiju: 'ప్రేమలు' బ్యూటీ పుట్టినరోజు ఈరోజు, ఏమి చేసిందో తెలుసా

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:30 PM

అంతకు ముందు కొన్ని మలయాళం సినిమాలు చేసినా, 'ప్రేమలు' సినిమా విజయవంతం అవటంతో అందులో నటించిన మమిత బైజు ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ సినిమా తెలుగులో కూడా విజయం సాధించి తెలుగు ప్రేక్షకులు కూడా మమిత క్యూట్ నటనకి ఫిదా అయిపోయారు. ఈరోజు మమిత పుట్టినరోజు కావటం విశేషం.

Mamitha Baiju: 'ప్రేమలు' బ్యూటీ పుట్టినరోజు ఈరోజు, ఏమి చేసిందో తెలుసా
Mamitha Baiju

మమిత బైజు అనే పేరు ఈరోజు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితం అయిన పేరు. ఈ మలయాళం బ్యూటీ కొన్ని మలయాళం సినిమాలు చేసింది, ఒక్క మలయాళం ప్రేక్షకులకి మాత్రమే తెలిసింది. కానీ ఆమె సినిమా 'ప్రేమలు' మలయాళంలో విడుదలై, ఆ తరువాత అదే సినిమాని తెలుగులోకి విడుదల చేశారు. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ ఆ మలయాళం 'ప్రేమలు' ని తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేశారు. (Happy birthday to Mamitha Baiju)

mamithabaiju.jpg

తెలుగులో కూడా ఈ సినిమా విజయఢంకా మోగించింది. మమిత బైజు అనే అందమైన అమ్మాయి ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా చేసింది. ఆమె తన క్యూట్ నటనతో అందరినీ మెప్పించడమే కాకుండా, తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా దగ్గరైంది. (Mamitha Baiju became overnight star with the success of Premalu)

mamithabaijua.jpg

అయితే అంతకు ముందు కొన్ని మలయాళం సినిమాలు చేసినా 'ప్రేమలు' హిట్ అవడం, అందులో ఆమె క్యూట్ గా ఉండటం చూసి, ఇంకేముంది కుర్రకారు అంతా ఇంకా ఆమె నటనకి ఫిదా అయిపోయారు. ఒక్కసారిగా మమిత బైజు అనే పేరు మళయాళంలోనే కాకుండా తెలుగునాట కూడా మారుమోగింది.

Premalu Movie Review: నవ్వులే నవ్వులు

Mamitha (1).jpeg

ఇంత పేరు తెచ్చుకున్న మమితకి ఇప్పుడు వరసగా సినిమాలు వస్తున్నాయని ఒక వార్త నడుస్తోంది. సినిమాలతో పాటు మమితకి యాడ్స్ కూడా వస్తున్నాయని, ఆమె తాజాగా ఒక చాకొలేట్ కి సంబందించిన యాడ్ చేసిందని, ఆ యాడ్ కోసం కుర్రకారు అంతా అంతర్జాలంలో తెగ వెతుకుతున్నారని వినికిడి.

mamithabaijub.jpg

ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ 'ప్రేమలు' సినిమా చిత్రీకరణ ఎక్కువగా హైదరాబాదులోనే జరగటం విశేషం. అలాగే ఇప్పుడు మమిత బైజుకి తెలుగు దర్శకులు, నిర్మాతలు కూడా తెలుగు సినిమాలోకి తీసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారాం. ఏమైనా ఒక్క సినిమాతో మమిత బైజు ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది.

ఈరోజు మమిత బైజు పుట్టినరోజు, అందుకని ఆమెకి సామాజిక మాధ్యమాల్లో ఆమె స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతున్నారు.

Updated Date - Jun 22 , 2024 | 04:30 PM